బాలీవుడ్ బాద్ షా షారుఖ్ సిల్వర్ స్క్రీన్ పై సందడి చేసి చాలా కాలం అయిపోయింది. 2018 లో జీరో సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు షారుఖ్.. ఆ తరువాత మరే సినిమా చేయలేదు. మధ్యలో కరోనా రావడం వల్ల కూడా షారుఖ్ కు గ్యాప్ వచ్చింది. ఇక ఇప్పుడు వరుసగా పలు సినిమాలతో బిజీ అయిపోయాడు. అందులోనే పఠాన్ సినిమా కూడా ఒకటి. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ఈసినిమా రూపొందుతుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇక ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా నుండి షారుఖ్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇంటెన్స్ లుక్ తో ఉన్న షారుఖ్ పోస్టర్ ఆకట్టుకుంటుంది. ఇక దీనితో పాటు రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు. వచ్చే ఏడాది 2023 జనవరి 25వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తుండగా.. జాన్ అబ్రహం కీలకపాత్రల్లో నటిస్తున్నారు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఓ స్పెషల్ పాత్రలో అలరించనున్నారని సమాచారం. ఈ సినిమాను యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తుండగా.. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.
See you next year on 25th Jan, 2023. Celebrate #Pathaan with #YRF50 only at a big screen near you on 25th January, 2023. Releasing in Hindi, Tamil and Telugu. @deepikapadukone | @TheJohnAbraham | #SiddharthAnand | @yrf pic.twitter.com/MUN3XFq5u3
— Shah Rukh Khan (@iamsrk) June 25, 2022
ఇక సినిమాతో పాటు షారుఖ్ ప్రస్తుతం ‘జవాన్’ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటిస్తుంది. వీటితో పాటుగా రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో ‘డంకీ’ చిత్రాన్ని చేస్తున్నాడు. త్వరలోనే ఈసినిమా షూటింగ్ ను కూడా ప్రారంభించనున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.