ప్రస్తుతం వస్తున్న పాన్ ఇండియా సినిమాల్లో మోస్ట్ అవైటెడ్ సినిమా ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న సలార్ ఒకటి. ఈసినిమాను కూడా యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్ టైన్ మెంట్ గా తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ నీల్. ఇక ఈసినిమా ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే కదా. కొంతవరకూ షూటింగ్ ను కూడా పూర్తి చేసుకుంది. మధ్యలో కొంత బ్రేక్ పడినా ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాలో పృథ్వీరాజ్ కూడా నటిస్తున్నట్టు గతకొద్దికాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే కదా. అయితే తాజాగా ఈవార్తలపై స్పందించిన పృథ్వీరాజ్ క్లారిటీ ఇచ్చాడు. నిజానికి ఈసినిమాలో నేను నటించాల్సి ఉంది. కె.జి.యఫ్ 2 సినిమా కంటే ముందే కథ విన్నా అప్పుడే ఓకే చెప్పాను. కానీ ఆతరువాత పాండమిక్ వల్ల అన్నీ మారిపోయాయి. ఆ తరువాత నాకు డేట్స్ అడ్జస్ట్ అవ్వకపోవడం వల్ల సలార్లో భాగం కాలేకపోయాను. అయితే ఇప్పుడు డేట్స్ అడ్జస్ట్ అయ్యే అవకాశం ఉంది.. ఇప్పుడైతే నటించే అవకాశం ఉందని తెలిపాడు.
కాగా ఈసినిమాలో ప్రభాస్ కు జోడీగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. హోంబలే ఫిలిమ్స్ పతాకంపై బ్లాక్ బస్టర్ మూవీ ‘కె.జి.యఫ్’ నిర్మించిన విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇక కన్నడ స్టార్ మధు గురుస్వామి ప్రభాస్ కు విలన్‌గా చేస్తున్నాడు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు ఈసినిమాకు.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: