హీరో ప్రభాస్ అడిగితే ఏ క్యారెక్టర్ కైనా సిద్ధం – గోపీచంద్

Gopichand about working with Prabhas,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, GopiChand,Hero GopiChand,GopiChand Latest Movie Updates,GopiChand About Prabhas,GopiChand About Pan Indian Star Prabhas, Pakka Commercial,Pakka Commercial Movie,Pakka Commercial Telugu Movie,Gopichand Pakka Commercial Movie Updates,Pakka Commercial Latest Updates, Pakka Commercial Movie Latest News,Pakka Commercial Movie Release Date Updates,Gopichand Friendship With Prabhas,Gopichand and Prabhas Friendship

“తొలివలపు ” మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన గోపీచంద్ సూపర్ హిట్ “జయం “, “వర్షం ” వంటి మూవీస్ లో విలన్గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. “యజ్ఞం” మూవీ విజయం సాధించడం తో గోపీచంద్ హీరోగా సెటిల్ అయ్యారు. పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ గోపీచంద్ యాక్షన్ చిత్ర హీరోగా పేరు పొందారు. గోపీచంద్ ప్రస్తుతం శ్రీ వాస్ దర్శకత్వంలో “#గోపీచంద్ 30 “మూవీ లో నటిస్తున్నారు. మారుతి దర్శకత్వంలో యాక్షన్ చిత్ర హీరో గోపీచంద్ , అందాల రాశీ ఖన్నా జంటగా తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ “పక్కా కమర్షియల్‌” మూవీ జులై 1 వ తేదీ రిలీజ్ కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“పక్కా కమర్షియల్‌” మూవీ ప్రమోషన్స్ లో భాగంగా గోపీచంద్ పలు ఇంటర్వూస్ లో పాల్గొంటున్నారు. తాజాగా ప్రభాస్ పై తన ఫీలింగ్స్ ను గోపీచంద్ వెల్లడించారు. గోపీచంద్ మరియు ప్రభాస్ లు చాలా సంవత్సరాలుగా మంచి స్నేహితులు. ఇద్దరు కలిసి హీరో ప్రభాస్ ఫస్ట్ సూపర్ హిట్ “వర్షం” సినిమాలో నటించారు. ఆ తర్వాత కూడా చాలా సందర్భాల్లో ఒకరి సినిమా ల ఫంక్షన్ కు మరొకరు హాజరు అవ్వడం చేస్తూ వచ్చారు. ఇద్దరి మద్య చాలా క్లోజ్ ఫ్రెండ్ షిప్ అయితే ఉందనేది అందరికి తెలిసిందే. ప్రభాస్ తో గతంలోనే విలన్ గా నటించిన గోపీచంద్ ఇప్పుడు తాను హీరోగా బిజీగా ఉన్నారు.అయినా కూడా ప్రభాస్ అడిగితే విలన్ పాత్ర మాత్రమే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటించేందుకు సిద్దం అన్నట్లుగా ప్రకటించి ప్రభాస్ పై ఉన్న అభిమానం ను గోపీచంద్ చాటుకున్నారు .

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + thirteen =