విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా వస్తున్న సినిమా థాంక్యూ. మనం సినిమా తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా ఇది. మనం బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఈసినిమా కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈసినిమా ఎప్పుడో మొదలైనా కూడా ఇంతవరకూ రిలీజ్ కాలేకపోయింది. ఈసినిమా కంటే వెనుక మొదలైన బంగార్రాజు సినిమా రిలీజ్ కూడా అయిపోయి హిట్ ను సొంతం చేసుకుంది. కరోనా ఈసినిమా షూటింగ్ కు బ్రేకులు పడ్డాయి. ఆ తరువాత ధైర్యం చేసి మేకర్స్ విదేశాల్లో షూటింగ్ జరిపారు. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక ఇప్పటికే ఈసినిమాను నిజంగా జులై 8 వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ఇప్పుడు మరోసారి థాంక్యూ సినిమా రిలీజ్ కు బ్రేక్ పడింది. ఈసినిమా రిలీజ్ ను రెండు వారలు వెనక్కి జరిపారు మేకర్స్. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ అవ్వడం కాస్త లేట్ అవుతున్న నేపథ్యంలో ప్రోపర్ ప్రమోషన్స్ ను చేయడానికి టైమ్ ఉందడని భావించి ఈసినిమా రిలీను వాయిదా వేస్తున్నట్టు తెలుస్తుంది. జూన్ 22వ తేదీన ఈసినిమా రిలీజ్ ను చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. మరి ఫ్యాన్స్ కు ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పొచ్చు.
#ThankYouTheMovie is now hitting the screens on July 22nd!
It will be worth the wait…We promise! #ThankYou for understanding ♥️ @chay_akkineni @RaashiiKhanna_@Vikram_K_Kumar @MusicThaman @pcsreeram @BvsRavi @SaiSushanthR #MalavikaNair @avika_n_joy @SVC_official @adityamusic pic.twitter.com/xAyBsIbMxJ
— Sri Venkateswara Creations (@SVC_official) June 24, 2022
ఈసినిమాలో రాశీఖన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. అవికా గోర్,మాళవిక నాయర్, ప్రకాష్ రాజ్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ మూవీని నిర్మిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.