హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1, చాప్టర్ 2 “మూవీస్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , శృతి హాసన్ జంటగా భారీ బడ్జెట్ తో తెలుగు , కన్నడ భాషలలో యాక్షన్ థ్రిల్లర్ “సలార్ “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.“సలార్” మూవీ డార్క్ సెంట్రిక్ థీమ్ టెక్నాలజీ తో తెరకెక్కుతుంది. భారత చలన చిత్ర పరిశ్రమలో డార్క్ సెంట్రిక్ థీమ్ టెక్నాలజీ తో తెరకెక్కుతున్న మొదటి చిత్రం “సలార్”. ఈ మూవీ లో ఫస్ట్ టైమ్ ప్రభాస్ , శృతి హాసన్ జంటగా నటిస్తూ ప్రేక్షకులను అలరించనున్నారు.మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఓ కీలక పాత్ర లో నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న“సలార్” మూవీ లో ప్రభాస్ కై మేకర్స్ స్పెషల్ జీప్ ను సెలెక్ట్ చేశారు. రస్టిక్ లుక్ తో ఈ జీప్ డిజైన్ అయ్యింది.ప్రస్తుతం ప్రభాస్ పై భారీ యాక్షన్ సీన్స్ ను దర్శకుడు ప్రశాంత్ తెరకెక్కిస్తున్నారు. తాజాగా, ఈ సినిమా కోసం 4.6కె రిజల్యూషన్‌తో కూడిన అలెక్స్ సూపర్ 35 ఎంఎం కెమెరాని వినియోగిస్తుండడం విశేషం. ఈ కెమెరాతో కళ్ళు చెదిరేలా విజువల్స్ చిత్రీకరించ వచ్చనీ , వాటికి అదనంగా ఎలాంటి డీటెయిలింగ్ అవసరం లేదని సమాచారం. యాక్షన్ బ్లాక్స్ కోసం ఈ కెమెరాను ప్రత్యేకంగా వాడుతున్నారనీ, సినిమాలో యాక్షన్ బ్లాక్స్, ఇంతవరకు ఇండియన్ సినిమా స్క్రీన్‌పై ఎవరూ చూడని విధంగా రూపొందిస్తున్నారనీ సమాచారం.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























