రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్ నేషనల్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “ఖైదీ “మూవీ ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ , విజయ్ సేతుపతి , ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ “విక్రమ్ “తమిళ మూవీ , తెలుగు డబ్బింగ్ వెర్షన్”విక్రమ్ ” జూన్ 3వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఈ మూవీ లో బిగ్ బీ అమితాబ్ అతిథి పాత్రలో నటించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. హీరో కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ తమ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక ప్రత్యేక పాత్రలో కనిపించిన సూర్య అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. “విక్రమ్”మూవీ ఘనవిజయం సాధించడంతో విమర్శకులతో పాటు పలువురు ప్రముఖులు కూడా ప్రశంసిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“విక్రమ్ ” తెలుగు, తమిళ రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా పాజిటివ్ టాక్ తో , భారీ కలెక్షన్స్ తో ప్రదర్శించబడుతుంది. ప్రపంచవ్యాప్తంగా పది రోజులలో 300 కోట్లకు పైగా వసూళ్ళతో “విక్రమ్ ” మూవీ దూసుకుపోతుంది. ఈ మూవీ తెలుగు వెర్షన్ నాలుగు రోజుల్లో బ్రేక్ ఈవెన్ కి చేరడం విశేషం.సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన “2.O” , ” కబాలి”, “రోబో” సినిమాల తరువాత వరల్డ్ వైడ్‌గా మూడు వందల కోట్ల వసూళ్లను సాధించిన నాలుగో తమిళ సినిమాగా “విక్రమ్”మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది.తమిళనాడులో కలెక్షన్స్ పరంగా రికార్డులను సృష్టిస్తోంది. తమిళనాడు లో “బాహుబలి 2”, “కె జి ఎఫ్ 2” మూవీస్ రికార్డులను అధిగమిస్తూ 150 కోట్ల వసూళ్లను చేరుకున్నట్లు సమాచారం. కేరళలోనూ విక్రమ్ సినిమాకు 30 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. మలయాళంలో అత్యధిక వసూళ్లను సాధించిన తమిళ సినిమాగా టాప్ ప్లేస్‌లో నిలిచింది. కమల్‌హాసన్ కెరీర్‌లో ఇదే అత్యధిక వసూళ్లను సాధించిన సినిమా కావడం విశేషం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: