యంగ్ హీరో నిఖిల్ కథానాయకుడిగా తెరకెక్కిన 4 సినిమాలు షూటింగ్ కంప్లీట్ చేసుకున్నాయి. వరస మూవీస్ తో నిఖిల్ ప్రేక్షక , అభిమానులను అలరించనున్నారు. చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా థ్రిల్లింగ్ మిస్టరీ “కార్తికేయ మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కిన “కార్తికేయ 2 “మూవీ జూలై 22 వ తేదీ తెలుగు , హిందీ భాషలలో రిలీజ్ కానుంది. ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ , అనుపమ జంటగా తెరకెక్కిన “18 పేజెస్ “మూవీ సెప్టెంబర్ లో రిలీజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
గారీ బి.హెచ్ దర్శకత్వంలో నిఖిల్ , ఐశ్వర్య మీనన్ జంటగా తెరకెక్కుతున్న “స్పై”మూవీ షూటింగ్ , శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై సుధీర్ వర్మ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా తెరకెక్కుతున్న మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యాయి. తాజాగా చందు మొండేటి దర్శకత్వంలో మరొక మూవీ కి నిఖిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. నిఖిల్ హీరోగా పలు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: