‘ఎఫ్3’.. ‘ఫన్’టాస్టిక్ సెలబ్రేషన్స్..!

F3 Movie Team To Celebrate Success In Vizag,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, F3,F3 Movie,F3 Telugu Movie,F3 Movie Celebrations,F3 Movie Latest Updates,F3 Movie Team Celebrates Success in Vizag,F3 Movie Success Celebrations at Vizag, F3 movie Team Venkatesh and Varun Tej,Anil Ravipudi At Vizag,F3 Movie Venkatesh,Varun Tej and Anil Ravipudi Celebrates Success in Vizag,F3 Movie Team At Vizag, Venaktesh and Varun Tej Multistarrer Movie F3 Latest Team Success Celebrations in Vizag

ఈమధ్య కాలంలో దాదాపు పాన్ ఇండియా సినిమాలు ఇంకా యాక్షన్ సినిమాలే ఎక్కువయ్యాయి. అండ్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ తో వచ్చే సినిమాలు చాలా తక్కువైపోయాయి. దీనివల్ల ఫ్యామిలీ ఆడియన్స్ కూడా థియేటర్లకు రావడం తక్కువైపోయింది. అలాంటి టైంలో ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ గా వచ్చి అందరినీ నవ్విస్తూ చాలా కాలం తరువాత ఒక సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వచ్చేలా చేసింది ఎఫ్3. అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా..త‌మ‌న్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా వస్తున్న సినిమా ఎఫ్3. మే 27న స‌మ్మర్ సోగ్గాళ్లుగా థియేటర్స్ ముందుకు వచ్చిన ఈసినిమా ఆడియన్స్‌కు నవ్వుల విందు అందిస్తోంది. అంతేకాదు కలెక్షన్ల పరంగా కూడా దూసుకుపోతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తుంది. ఇక ఈసినిమా రిలీజ్ అయి రెండు వారాలు సక్సెస్ ఫుల్ గా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుండటంతో సక్సెస్ సెలబ్రేషన్స్ ను నిర్వహించనున్నారు.వైజాగ్‌లోని ఆర్‌కే బీచ్ ద‌గ్గ‌రున్న గోకుల్ పార్క్‌లో సక్సెస్ సెల‌బ్రేష‌న్స్ చేసుకోనున్న‌ట్టు ప్రకటించారు మేకర్స్. చిత్రయూనిట్ అంతా కలిసి సక్సెస్ సెలబ్రేషన్స్ లో పాల్గొననున్నారు.

కాగా ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వ‌రా క్రియేష‌న్స్ ప‌తాకంపై దిల్‌రాజు, శిరీష్‌లు నిర్మించారు. సోనాల్ చౌహాన్, మురళీ శర్మ, రాజేంద్రప్రసాద్, అలీ, సునీల్ ఇతర పాత్రల్లో న‌టించారు. మరోవైపు ఈసినిమా ఓటీటీ రిలీజ్ పై కూడా క్లారిటీ ఇచ్చారు. ఈసినిమా నాలుగు వారాల్లో రిలీజ్ అవుతుందన్న వార్తలపై స్పందిస్తూ అప్పుడే ఓటీటీలోకి రాదని.. ఎనిమిది వారాల తర్వాతే ఓటీటీలోకి వస్తుందని క్లారిటీ ఇచ్చారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − 17 =