భారత చలన చిత్ర చరిత్ర లో అత్యధిక బడ్జెట్ తో “ఆదిపురుష్”

Prabhas Adipurush is India’s highest budget film,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Adipurush,Adipurush Movie Updates,Adipurush Upcoming Movie,Adipurush Latest Movie Udpates,Prabhas Adipurush Movie Updates,Pan India Star Prabhas Upcoming Movie Adipurush, Adipurush Big Budgegt Movie,Indias Highest Bigbudget Movie Adipurush Latest Updates,Adipurush Indias Highest Budget Film,Prabhas Upcoming Movie,Prabhas New Movie Updates, Prabhas Next Project,Prabhas Bigbudget Movie Updates,Rebel Star Prabhas

టి – సిరీస్ ,రెట్రో ఫైల్స్ బ్యానర్స్ పై సూపర్ హిట్ “తానాజీ “మూవీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా భారీబడ్జెట్ తో 3డి ఫార్మాట్ లో రామాయణం ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో మైథలాజికల్ మూవీ గా తెరకెక్కుతున్న “ఆదిపురుష్ ” మూవీ 2023 సంవత్సరం జనవరి 12వ తేదీ తెలుగు , హిందీ భాషలతో పాటు కన్నడ , తమిళ , మలయాళ భాష డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కానున్నాయి. హీరో ప్రభాస్ రాముడిగా నటిస్తున్న ఈ మూవీ లో సీతగా కృతి సనన్ , రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ , లక్ష్మణుడిగా సన్నీసింగ్ నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

భారత చలన చిత్ర చరిత్ర లో అత్యధిక బడ్జెట్ తో, హాలీవుడ్ స్థాయి టెక్నాలజీ తో “ఆదిపురుష్” మూవీ తెరకెక్కింది. “ఆదిపురుష్” మూవీ బడ్జెట్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న”ఆదిపురుష్” మూవీ నిర్మాత , టి – సిరీస్అధినేత భూషణ్ కుమార్ మాట్లాడుతూ . “ఆదిపురుష్” మూవీని 400 కోట్లతో నిర్మిస్తున్నామనీ , ప్రమోషన్లతో కలుపుకుంటే ఈ సినిమా ఐదొందల కోట్లు దాటేలా ఉందనిపిస్తోందనీ చెప్పారు. హీరో ప్రభాస్ ఫస్ట్ టైమ్ మైథలాజికల్ మూవీ లో నటిస్తున్నారు. హీరో ప్రభాస్ సినీ కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న “ఆదిపురుష్ “మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + 2 =