‘ఎఫ్3’ మూవీ రివ్యూ

2022 Movie Reviews, Ali, Anil Ravipudi, Dil Raju, DSP, F3, F3 (2022), F3 FDFS Review, F3 Film, F3 First Review Out, F3 Highlights, F3 Movie, F3 Movie (2022), F3 Movie Censor Review, F3 Movie Critics Review, F3 Movie First Review, F3 Movie Highlights, F3 Movie Latest News, F3 Movie Latest News and Updates, F3 Movie Plus Points, F3 Movie Pre Review, F3 Movie Public Response, F3 Movie Public Talk, F3 Movie Review, F3 Movie Review (2022), F3 Movie Review And Rating, F3 Movie Story, F3 Movie Updates, F3 Preview, F3 Public Response, F3 Review, F3 Review And Rating, F3 Telugu Movie, F3 Telugu Movie Latest News, F3 Telugu Movie Live Updates, F3 Telugu Movie Review, F3: Fun and Frustration, F3: Fun and Frustration Movie (May 2022), Latest telugu movie reviews, latest telugu movies news, latest tollywood updates, mehreen pirzada, New Movies Reviews, Sonal Cauhan, Sunil, Tamannaah, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Movie Updates, Varun Tej, Varun Tej F3 Movie Review, Venkatesh, Venkatesh And Varun Tej F3 Movie Review, Venkatesh F3 Movie Review

అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఎఫ్ 3. ఈసినిమా ఎఫ్ 2 సినిమాకు సీక్వెల్ గా వస్తుంది. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఎఫ్ 2 సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో ఎఫ్ 3 పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఇప్పటివరకూ రిలీజ్ చేసిన పాటలు, టీజర్, ట్రైలర్ కూడా సినిమాపై అంచనాలు పెంచేసింది. మరి ఈసినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈసినిమా ఎలా ఉందో తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నటీనటులు.. వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్, సోనాల్ చౌహన్, సునీల్, రాజేంద్ర ప్రసాద్, మురళీ శర్మ, అలీ, వెన్నెల కిషోర్, సంపత్, సత్య, ప్రగతి తదితరులు
దర్శకత్వం.. అనిల్ రావిపూడి
బ్యానర్స్.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
నిర్మాతలు.. దిల్‌రాజు, శిరీష్‌
సంగీతం.. దేవి శ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫి.. సమీర్ రెడ్డి

కథ..

ఈసినిమా ఎఫ్2 కు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. అయితే ఎఫ్2 లో ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ అంటూ ప్రేమ, పెళ్లి గురించి పెళ్లి తరువాత వచ్చే ఫ్రస్ట్రేషన్ గురించి చూపించాడు అనిల్ రావిపూడి. అయితే ఈసీక్వెల్ లో డబ్బు ప్రధానంగా చూపించాడు. దురాశ తో డబ్బు కోసం మనిషి ఎలాంటి అడ్డదారులు తొక్కుతాడు.. ముఖ్యంగా మధ్య తరగతి మనుషులు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారు.. అన్నది ఈసినిమా కథ.

వెంకటేష్, వరుణ్ తేజ్ డబ్బు సంపాదించి జీవితంలో సెటిలవ్వాలని చూస్తుంటారు. ఆ సమయంలో హనీ (మెహ్రీన్)ను చూసి డబ్బున్న అమ్మాయి అనుకొని ఆమెను పెళ్లి చేసుకుంటే తన ఆస్తి దక్కుతుందని అనుకుంటాడు వరుణ్. దానికి వెంకీతో కలిసి ప్లాన్ చేస్తాడు. ఇక తనను ప్రేమలో పడేయడానికి చాలా డబ్బు ఖర్చుపెడతారు. ఫైనల్ గా హనీ నిజ స్వరూపం బయటపడుతుంది. హానీ వల్ల చేసిన అప్పుల భారం వెంకీ-వరుణ్ మీద పడుతుంది. ఈక్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త (మురళీ శర్మ) తన తప్పిపోయిన కొడుకు కోసం వెతుకుతూ ఉంటాడు. అప్పటికే పూర్తి సమస్యల్లో చిక్కుకున్న వెంకీ, వరుణ్ అలాగే తమన్నా ఫ్యామిలీ కొడుకు అంటూ ఆ ఇంటికి వెళ్తారు. ఎవరికీ వారు కొడుకుగా నమ్మించి కోట్లాది ఆస్తికి వారసులు కావాలని ప్లాన్ చేసుకుంటారు. ఈ పరిస్థితుల్లో డబ్బుల కోసం వాళ్లేం చేశారు.. దాని వల్ల తలెత్తిన ఇబ్బందులేంటి.. వీటి నుంచి వాళ్లు చివరికి ఎలా బయటపడ్డారు అన్నది మిగతా కథ.

అనిల్ రావిపూడి డైరెక్షన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పటాస్ సినిమాతో డైరెక్టర్ గా పరిచయమయ్యాడు అనిల్ రావిపూడి. అలా మొదలుపెట్టిన తన కెరీర్ లో ఇప్పటివరకూ సక్సెస్ లు మాత్రమే అందుకుని సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరుతెచ్చుకున్నాడు. అందుకే అనిల్ రావిపూడి సినిమా అంటే మినిమం గ్యారెంటీ అన్న నమ్మకం ఉంది అందరికీ. అలానే తన సినిమాల్లో భారీ భారీ యాక్షన్ ఎపిసోడ్ లు, భారీ సెట్టింగ్ లు లాంటివి ఏం ఉండవు. కామెడీనే బలంగా కథలు రాసుకుంటాడు.. దానికి తగినట్టుగా కమర్షియల్ ఎలిమెంట్స్ జోడిస్తాడు. తెలుగు ప్రేక్షకులకు కావాల్సిన ఎలిమెంట్స్ పుష్కలంగా ఉంటాయి కాబట్టే విజయాలను అందుకుంటాడు. ఇప్పుడు ఎఫ్ 3 సినిమాకు కూడా అదే రిపీట్ అయింది.

ఎఫ్ 2 సినిమాకు సీక్వెల్ గా వచ్చిన ఎఫ్ 3 నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇక కామెడీ సినిమాలు అంటే అందులో కథ, కథనాలు, కొత్త దనం అన్న విషయాలు పక్కన పెట్టాల్సిందే. ఎందుకంటే ఇలాంటి సినిమాలకు కొత్తదనం, లాజిక్ లు అంటూ ఏం ఉండవు. ప్రీ మైండ్ తో సినిమాకు వెళ్లి కామెడీని ఎంజాయ్ చేయాల్సిందే. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకూ ప్రేక్షకులు నవ్వుతూనే ఉంటారు. ఆ విషయంలో మాత్రం అనిల్ రావిపూడి మరోసారి సక్సెస్ అయ్యాడు. అనిల్ రావిపూడి కూడా తన శైలి కామెడీతో, తన మార్క్ డైలాగ్ లతో కొన్ని సన్నివేశాల్లో చాలా బాగా ఎంటర్ టైన్ చేశాడు.

ఇక ఈసినిమాలో ఎఫ్ 2 సినిమాలో ఉన్న హీరో హీరోయిన్లే ప్రధానంగా నటించగా కొంతమంది కొత్తవాళ్లను తీసుకున్నాడు అనిల్. అయితే ఈసీక్వెల్ లో.. తొలి భాగంలో భార్యాభర్తలు.. ప్రేమికుల్లా చూపించిన ప్రధాన పాత్రలను ఇక్కడ మళ్లీ కొత్తగా చూపించారు. అందరికీ ఒకటే ప్రాబ్లమ్ డబ్బు. ఇందులో ప్రధాన ఆకర్షణ వెంకీ-వరుణ్ పాత్రలే. ఒకరిని రేచీకటి బాధితుడిగా.. ఇంకొకరిని నత్తితో ఇబ్బంది పడే కుర్రాడిగా చూపిస్తూ వేర్వేరుగా మేనరిజమ్స్ పెట్టి వాటి చుట్టూ ప్రథమార్ధంలో కామెడీ అదరగొట్టాడు అనిల్. ఇక తమన్నా, మెహ్రీన్ లతో పాటు సినిమాలోని నటీనటులంతా తమ పాత్రలకు తగిన న్యాయం చేశారు. పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ హైలైట్ గా ఉంటుంది.

ఇక సాంకేతిక విభాగానికి వస్తే దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ఈసినిమాకు మరో హైలెట్. రిలీజ్ కు ముందే పాటలకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో మరోసారి మెప్పించాడు. సినిమాటోగ్రఫి కూడా బాగుంది. దిల్ రాజు నిర్మాణ విలువల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఓవరాల్ గా చెప్పాలంటే ఫ్యామిలీ ఆడియన్స్ తో కామెడీ ఇష్టపడే ప్రతి ఒక్కరికీ ఈసినిమా నచ్చుతుంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here