పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ తో ‘ఏజెంట్’

Agent Movie Team Busy Shooting Powerful Action Scenes,Akhil Akkineni’s Agent Movie Shooting Update,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Agent,Agent Movie,Agent Telugu Movie,Agent Movie Updates,Agent Telugu Movie Latest News,Akhil Akkineni,Agent Movie Shooting Updates,Agent Telugu Movie Shooting Latest News

చాలా కాలం నుండి మంచి సక్సెస్ కోసం ఎదురుచూసిన యంగ్ హీరో అఖిల్ ఫైనల్ గా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమాతో ఒక హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా వస్తున్న సినిమా ఏజెంట్. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో.. పూర్తి స్పై థ్రిల్లర్ మూవీగా.. అత్యంత స్టైలిష్‌గా సురేందర్ రెడ్డి ఈసినిమాను తెరకెక్కిస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక వారి అంచనాలు మరింత పెంచేస్తూ ఈ సినిమా కోసం అఖిల్ మేకోవర్, ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఉండటంతో ఈసినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది. ఇక తాజాగా ఈసినిమా షూటింగ్ కు సంబంధించిన షూటింగ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా షూటింగ్ ప్రస్తుతం మనాలిలో జరుగుతుందని.. అక్కడ భారీ యాక్షన్ సీక్వెన్స్ ను తెరకెక్కిస్తున్నట్టు తెలిపారు. అంతేకాక ఒక వర్కింగ్ స్టిల్ ను విడుదల చేశారు. ఈ ఫోటో లో అఖిల్ తో పాటు డైరెక్టర్, చిత్ర యూనిట్ సభ్యులు కూడా ఉన్నారు. ఇక ఫొటోలో అఖిల్ సూపర్ స్టైలిష్ గా కనిపిస్తున్నారు.

కాగా ఈసినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తుంది. ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్‌పై అనీల్ సుంక‌ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే వక్కంతం వంశీ అందించాడు. థమన్ ఎస్ సంగీతం అందిస్తుండగా.. సినిమాటోగ్రాఫర్ గా రగుల్ హెరియన్ ధరుమన్ వ్యవహరిస్తున్నారు. ఆగష్ట్ 12న ఈసినిమా రిలీజ్ కానుంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five − two =