మెగాస్టార్ చిరంజీవి కూడా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ఇటీవలే శివ కొరటాల దర్శకత్వంలో వచ్చిన ఆచార్య సినిమా ప్రేక్షకుల ముందుకు రాగా ఈసినిమా మిక్డ్స్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు తన తరువాత ప్రాజెక్ట్స్ పై ఫోకస్ ను పెడుతున్నాడు చిరు. ప్రస్తుతం మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ సినిమా చేస్తున్నాడు. ఇంకా రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమా కూడా చేస్తున్నాడు. ఈసినిమా కూడా షూటింగ్ దశలో ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక వీటితో పాటు యంగ్ డైరెక్టర్ బాబితో కూడా ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమాను ఇప్పటికే ప్రకటించి షూటింగ్ కూడా మొదలుపెట్టారు కూడా. ఇదిలా ఉండగా ఈసినిమాకు
‘వాల్తేర్ వీరయ్య’ అనే టైటిల్‌ను దాదాపు ఫిక్స్ చేసినట్టు ఎప్పటినుండో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. కానీ, మేకర్స్ మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఈమధ్య ఆచార్య ప్రమోషన్స్‌లో చిరు ఈ సినిమా టైటిల్‌ని లీక్ చేసేశారు. యువ దర్శకులతో నిర్వహించిన ప్రత్యేక ఇంటర్వ్యూలో.. తాను టైటిల్ చెప్పనని అంటూనే ‘వాల్తేర్ వీరయ్య’ అని నోరు జారారు. ఇక ఇప్పుడు దర్శకుడు బాబి కూడా ఈసినిమా టైటిల్ ను కన్ఫామ్ చేశారు. విజయవాడలో మెగా ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన మీటింగ్‌లో పాల్గొన్న బాబి చిరుతో తాను చేస్తోన్న చిత్రానికి ‘వాల్తేర్ వీరయ్య’ టైటిల్‌ని ఫిక్స్ చేశామని క్లారిటీ ఇచ్చాడు.
కాగా ఈ సినిమాలో చిరంజీవి సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈసినిమాను బాబి మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించబోతున్నాడు. ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: