‘విక్రమ్’ తెలుగు ట్రైలర్ రిలీజ్..!

Vikram Telugu Movie Trailer Released,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Vikram,Vikram Movie,Vikram Telugu Movie,Vikram Movie Latest Updates,Vikram Upcoming Movie,Vikram Movie Trailer,Vikram Telugu Movie Trailer, Vikram Telugu Movie Official Trailer,Vikram Movie Trailer Released,Kamal Haasan Vikram Movie Trailer Out Now,Kamal Haasan Upcoming Movie Vikram Trailer Released

కమల్ హాసన్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నసినిమా విక్రమ్. ఈసినిమాకు ఖైదీ, మాస్టర్ ఫేమ్ లోకేష్ కనగరాజు దర్శకత్వం వహిస్తుండటంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈసినిమా రిలీజ్ కూడా చాలా లేట్ అయింది. మధ్యలో కరోనా రావడం కూడా ఈసినిమా రిలీజ్ లేట్ కు ఒక కారణం. ఫైనల్ గా జూన్ 3వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్స్ ను స్టార్ట్ చేశారు మేకర్స్. ఇక తెలుగులో ఈసినిమా హక్కులను నితిన్ హోమ్ బ్యానర్ అయిన శ్రేష్ఠ్ మూవీస్ సొంతం చేసుకోగా ఇక్కడ కూడా పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు ప్లాన్ చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పటికే ఈసినిమా నుండి తమిళ్ లో ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఆ ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఆద్యంతం యాక్షన్‌ ప్రధానంగా సాగే ఈ ట్రైలర్‌ అభిమానులకు బాగా నచ్చేసింది. ఇక ఈసినిమా తెలుగు ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. తెలుగు ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుంది.

ఇదిలా ఉండగా ఈసినిమాలో తమిళ టాలెంటెడ్ నటుడు విజయ్ సేతుపతి ఇంకా మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్, తమిళ్ స్టార్ హీరో సూర్య కూడా నటిస్తున్నారు. ఈసినిమాలో ఇంకా కాళిదాస్ జయరాం, నరేన్, ఆంటోనీ వర్గీస్, అర్జున్ దాస్, శివానీ నారాయణన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై కమల్ హాసన్, ఆర్.మహేంద్రన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అనిరుధ్‌ రవిచంద్రన్‌ సంగీతం అందిస్తుండగా.. గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రాఫర్ గా చేస్తున్నారు..

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − 4 =