సెన్సార్ పూర్తి చేసుకున్న ‘ఎఫ్ 3’

F3 Movie Censor Formalities Completed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, F3 Movie,F3 Movie Updates,F3 Movie Upcoming Movies,F3 Movie Latest Updates,F3 Movie Latest News,F3 Movie Censor Formalities,F3 Movie Completes Censor Formalities, F3 Movie certifed with U,f3 Movie Completes Censor Formalities with U certificate,Venkatesth and Varun Tej Mutli Starrer Movie F3 Completes Censor Formalities

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన ’ఎఫ్ 2’మూవీ ఎంత పెద్ద హిట్టైయిందో తెలిసిందే కదా. ఈ సినిమా 2019 సంక్రాంతికి విడుదలై ఘన విజయం సాధించింది. ఇక ఈసినిమాకు సీక్వెల్ ఇప్పుడు ఎఫ్3 సినిమాను తెరకెక్కించాడు అనిల్ రావిపూడి. ఈ సినిమాలో వెంకటేష్ .. రే చీకటితో బాధపడే వ్యక్తి పాత్రలో నటిస్తే.. వరుణ్ తేజ్.. నత్తితో బాధపడే వ్యక్తి పాత్రలో కనిపించనున్నారు. వీరితో ఈసారి మూడింతలు ఫన్ ను అందిస్తున్నా అంటున్నాడు అనిల్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన పాటలు దగ్గర నుండి టీజరు, థియేట్రికల్ ట్రైలర్ కు ప్రేక్షకులనుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. దీనితో సినిమాపై కూడా భారీగానే అంచనాలు పెరిగాయి. తాజాగా ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. అవుట్ అండ్ అవుడ్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈసినిమాకు సెన్సార్ బృందం క్లీ యూ సర్టిఫికెట్ ఇచ్చింది.

ఈసినిమాలో త‌మ‌న్నా, మెహ్రీన్ లు హీరోయిన్లుగా నటించగా సునీల్, సోనాల్‌చౌహ‌న్‌లు కీల‌క‌పాత్ర‌ల్లో నటిస్తున్నారు. పూజా హెగ్టే ఓ స్పెష‌ల్ సాంగ్‌లో కనిపించనుంది. శ్రీ వెంకటేశ్వ‌రా క్రియేష‌న్స్ ప‌తాకంపై దిల్‌రాజు, శిరీష్‌లు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈసినిమా మే 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.మరి ఎఫ్ 2 సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.. దాని సీక్వెల్ గా వచ్చిన ఈసినిమా ఎంత మేరకు హిట్ అవుతుందో తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ వరకూ ఆగాల్సిందే.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 1 =