సూపర్ స్టార్ మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ కామెడీ “సర్కారు వారి పాట” మూవీ మే 12 వ తేదీ గ్రాండ్ గా రిలీజ్ అయ్యి హిట్ టాక్ స్వంతం చేసుకొని తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. మహేష్ బాబు తన స్టైలిష్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. ఈ మూవీ లో సాంగ్స్ , ఫైట్స్ ప్రేక్షక , అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి.మహేష్ బాబు , కీర్తి ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రపంచవ్యాప్తంగా 5 రోజులకు 160 కోట్ల గ్రాస్ , 100 కోట్ల షేర్ తో దూసుకుపోతున్న “సర్కారు వారి పాట” మూవీ సూపర్ హిట్ అయిన సందర్భంగా ఎస్ టి బి సి గ్రౌండ్స్ , ప్రకాష్ నగర్ , కర్నూలు లో మ మ మాస్ సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరిగాయి. మ మ మహేషా సాంగ్ కు డ్యాన్సర్స్ డ్యాన్స్ చేస్తుండగా సంగీత దర్శకుడు థమన్ వారితో జాయిన్ అయ్యారు. ఆ ఉత్సాహ భరిత వాతావరణం లో మహేష్ బాబు తాను కూడా స్టేజ్ పైకి వెళ్ళి ఆ సాంగ్ కు స్టెప్స్ వేయడం విశేషం. ఫస్ట్ టైమ్ మహేష్ బాబు స్టేజ్ పై స్టెప్స్ వేయడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేశారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: