‘ఆర్ఆర్ఆర్’ 50 డేస్.. 500 సెంటర్స్..!

RRR Movie Completes 50 Successful Days,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, RRR,RRR Movie,RRR Telugu Movie,RRR Movie Updates,Ram Charan and Jr NTR Mutli Starrer Movie RRR,Rajamouli RRR Movie,Director Rajamouli RRR Movie Udpates, RRR Movie Completes 50Days,RRR Blockbuster movie Completes 50 Days,Raja Mouli RRR movie Completes 50 Days,Ram Charan and Jr NTR RRR Movie Completes 50days

దాదాపు నాలుగేళ్ల తరువాత రిలీజ్ అయిన సినిమా. ఫ్యాన్స్ తమ హీరోల కోసం ఎదురుచూసిన సినిమా. అదే ఆర్ఆర్ఆర్. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించి ఆర్ఆర్ఆర్ చిత్రం ఎంత పెద్ద హిట్టయిందో అందిరికీ తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈసినిమా దాదాపు రూ.1100 కోట్లకు పైగా సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టి పలు రికార్డులు క్రియేట్ చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక సినిమా ఒక వారం ఆడటమే ఎక్కువ అనుకుంటున్న నేపథ్యంలో ఈ సినిమా మరోసారి వాటన్నింటికీ భిన్నమని మరోసారి రాజమౌళి సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అని నిరూపించింది. ఈ సినిమా రిలీజ్ అయ్యి 50 రోజులను పూర్తీ చేసుకొని ఇంకా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతూనే ఉంది. ఈ గ్యాప్ లో ఎన్నో సినిమాలు రిలీజ్ అయినా కూడా ఈసినిమా మాత్రం చాలా సెంటర్స్ ను హోల్డ్ లో పెట్టుకుంది. ప్రపంచవ్యాప్తంగా 500 స్రీన్లలో 50 రోజులను పూర్తి చేసుకుంది. ఈ మేరకు ఆర్ఆర్ఆర్ టీమ్ ట్విట్టర్‌లో అధికారికంగా ప్రకటించింది.

ఈసినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో, అలానే రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించారు. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటించగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటించింది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి, రాహుల్ రామకృష్ణ నటించారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం పై దానయ్య ఈ సినిమాని నిర్మించగా. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం.. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫి అందించారు.

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × four =