న్యాచురల్ స్టార్ నాని కూడా వరుసగా సినిమాలను రిలీజ్ చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం మరో కొత్త సినిమాను రిలీజ్ చేయడానికి సిద్దంగా ఉన్నాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని హీరోగా వస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘అంటే సుందరానికి’. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ చిత్రంలో నాని సుందర్ అనే బ్రాహ్మణ అబ్బాయి పాత్రలో నటిస్తుండగా, నజ్రియా క్రిస్టియన్ అమ్మాయి లీలాగా కనిపించనున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టారు. దీనిలో భాగంగానే పంచెకట్టు అనే సాంగ్ అలానే ఎంత చిత్రం పాటలు రిలీజ్ చేయగా అవి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ మధ్య ప్రమోషన్స్ ను కాస్త విభిన్నంగా చేస్తూ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు మేకర్స్. దీనిలో భాగంగానే అంటే సుందరానికి టీమ్ కూడా వెరైటీ ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసింది. తాజాగా ప్రమోషన్స్ లో భాగంగా నాని, నజ్రియా ‘This or That’ ఛాలెంజ్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చేశారు. ఈ ఛాలెంజ్‌లో ఫస్ట్ నాన్ వెజ్-వెజ్ ప్రశ్న రాగా..నజ్రియా, నాని నాన్‌వెజ్ వైపు వెళతారు. ఆ తర్వాత ఎంత చిత్రం సాంగ్, పంచెకట్టు సాంగ్ రాగా..ఈ ఇద్దరూ ఎంత చిత్రం పాట వైపు వెళ్తారు. సైన్స్-మ్యాథ్స్ రాగానే నజ్రియా నేను స్ట్రెయిట్‌గా వెళ్లొచ్చా అంటూనే..మళ్లీ నానితో కలిసి సైన్స్ వైపు వెళ్తుంది. ఇక మెలోడీ సాంగ్స్-మాస్ సాంగ్స్ అని రాగానే నజ్రియా..మాస్ సాంగ్స్ వైపు వెళ్తుంది. ఫన్నీగా సాగే ఈ ఛాలెంజ్‌ను చిత్ర యూనిట్ తమ ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది.
Our cutest couple Sundar and Leela make their choices 😀
This or That ft. Natural ⭐@NameisNani & #NazriyaFahadh ❤️#EnthaChithram song from #AnteSundaraniki 🎧https://t.co/FDVQ1zkSvG#VivekAthreya @oddphysce @anuragkulkarni @ramjowrites @keerthanavnath @saregamasouth pic.twitter.com/K9kZCsbYXa
— Mythri Movie Makers (@MythriOfficial) May 13, 2022
కాగా ఈసినిమాలో నదియ,హర్ష వర్ధన్,రాహుల్ రామకృష్ణ,సుహాస్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాను మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ లు నిర్మిస్తున్నారు. వివేక్ సాగర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. నికేత్ బొమ్మి సినిమాటోగ్రాఫర్. జూన్ 10వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: