టాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న యంగ్ హీరోల్లో సందీప్ కిషన్ కూడా ఒకరు. సినిమా జయాపజయాలతో పనిలేకుండా సందీప్ కిషన్ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. అందులో ఒక సినిమానే మైఖేల్. రంజిత్ జయకోడి దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇక ఈసినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక నేడు సందీప్ కిషన్ పుట్టిన రోజు కావడంతో ఈసినిమా నుండి సర్ ప్రైజింగ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమాలోని సందీప్ కిషన్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇక పోస్టర్ లో మాత్రం సందీప్ కిషన్ సిక్స్ ప్యాక్ తో, మెర్సీలెస్ గా కనిపిస్తున్నాడు. ఫస్ట్ లుక్ తోనే సినిమాపై ఆసక్తిని పెంచేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
BLOOD, GUNS & GUTS!
Unveiling the Fiery and Menacing #MichaelFirstLook ❤️🔥 in all its Glory🌟
▶️ https://t.co/O25PSE3JBR#HBDSundeepKishan❤️#Michael 👊🏾@VijaySethuOffl @menongautham @varusarath5 @itsdivyanshak @jeranjit @SVCLLP @KaranCoffl @SamCSmusic @adityamusic pic.twitter.com/Qrp8URNRE1— Sree Venkateswara Cinemas LLP (@SVCLLP) May 7, 2022
కాగా యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో మజిలీ సినిమాతో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టిన దివ్యాంశ కౌశిక్ ఈసినిమాలో సందీప్ కు జోడీగా హీరోయిన్ గా నటిస్తుంది. విజయ్ సేతుపతి, వరలక్ష్మి శరత్ కుమార్, వరుణ్ సందేశ్ పలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అంతేకాదు. ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ కూడా ఈ సినిమాలో కీలకపాత్ర పోషించడం విశేషం. నారాయణ్ దాస్ కె. నారంగ్ సమర్పణలో భరత్ చౌదరి, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాను తెలుగు తో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























