“మజిలీ”, “వెంకీ మామ “, “లవ్ స్టోరి “, “బంగార్రాజు ” వంటి వరుస సూపర్ హిట్ మూవీస్ తో నాగచైతన్య టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరో గా రాణిస్తున్నారు. యూత్ &ఫ్యామిలీ ఆడియెన్స్ అలరిస్తూ విజయం సాధిస్తున్నారు.హీరో నాగచైతన్య ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “మనం “మూవీ ఫేమ్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో సింక్ సౌండ్ టెక్నాలజీ తో తెరకెక్కిన “థ్యాంక్యూ” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. నాగచైతన్య బాలీవుడ్ ఎంట్రీ మూవీ “లాల్ సింగ్ చద్దా” కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో “దూత “వెబ్ సిరీస్ తో నాగచైతన్య డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నారు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఒక మూవీ కి నాగచైతన్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
బ్లాక్ బస్టర్ “గీత గోవిందం “మూవీ ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా తెరకెక్కిన “సర్కారు వారి పాట ” మూవీ మే 12 వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. దర్శకుడు పరశురామ్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ .. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై నాగచైతన్య హీరో గా తెరకెక్కనుందని వెల్లడించారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: