14 ఏళ్ల బన్నీ ‘పరుగు’

14 Years for Allu Arjuns Parugu Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Allu Arjuns,Icon Star Allu Arjun,Allu Arjuns Movie Updates,Allu Arjuns latest Movie Updates,Allu Arjuns Upcoming Movies,Allu Arjuns New Movie Updates,Allu Arjuns Parugu Movie, 14 Years For Allu Arjun Movie Parugu,Parugu Movie Completes 14 Years,All Arjun Parugu Movie Completes 14 Years,Allu Arjun Parugu Blockbuster Movie Completes 14 Years

మన తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు ఉన్నారు. అయితే వారిలో కొంత మంది టాప్ పొజిషన్ లో ఉన్నా.. కొంతమంది ఆ స్థాయికి రావడానికి ప్రయత్నిస్తున్నారు. మొత్తానికి అప్ కమింగ్ హీరోలు, యంగ్ హీరోలు ఎవరికి వారు వారికి వచ్చిన సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. ఇక కొంతమంది హీరోలు మాత్రం ఎంత టాప్ పొజిషన్ లో ఉన్నా తమ హార్డ్ వర్క్ ను మాత్రం వదిలిపెట్టరు. అలాంటి హీరోల్లో అల్లుఅర్జున్ పేరు ముందు ఉంటుంది. తనతో పనిచేసిన ఏ ఒక్కరిని అడిగినా అల్లు అర్జున్ సినిమా కోసం ఎంత కష్టపడతాడో చెబుతారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

గంగోత్రి సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన అల్లు అర్జున్ మొదటిసినిమాతో సూపర్ హిట్ కొట్టాడు. ఇక ఆ తర్వాత నుండి ఇప్పటివరకూ తన కెరీర్ లో ఎన్నో సినిమాలు ఎన్నో పాత్రలు చేశాడు బన్నీ. అంతేకాదు స్టైలిష్ స్టార్ నుండి ఇప్పుడు ఐకాన్ స్టార్ అయ్యాడు. ఇక తన కెరీర్ లో మ్యూజికల్ హిట్ అందించిన సినిమాల్లో పరుగు సినిమా కూడా ఒకటి. అప్పటికే గంగోత్రి, ఆర్య, బన్నీ, దేశముదురు సినిమాలతో మంచి ఫామ్ లో ఉన్న బన్నీకి పరుగు కూడా మంచి హిట్ అందించింది. ఈసినిమాలో బన్నీ పెద్ద హడావుడి లేకుండా చాలా కంపోజ్డ్ గా నటించి మెప్పించాడు. బన్నీ అంటే ఎప్పుడూ యాక్టివ్ గా ఎనర్జిటిక్ గా నటిస్తాడన్న ఫీలింగ్ నుండి నెమ్మదిగా సెటిల్డ్ గా కూడా నటించగలడని ఈసినిమాతో నిరూపించాడు. అటు కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఎమోషనల్ యాంగిల్ ను కూడా ఈసినిమాలో చూపించడంతో ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. ఇక ఈసినిమా రిలీజ్ అయి నేటితో 14 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈసందర్భంగా చిత్రయూనిట్ మరోసారి ఈసినిమాను గుర్తుచేసుకుంది.

కాగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు నిర్మించిన ఈ చిత్రానికి ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వం వహించాడు. ఇందులో బన్నీ సరసన షీలా కథానాయికగా నటించగా జయసుధ, ప్రకాష్‌రాజ్, సునీల్, ‘చిత్రం’ శ్రీను, సుబ్బరాజు, చిత్ర‌లేఖ‌, సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి, ధన్‌రాజ్, పూనమ్ బాజ్వా ముఖ్య పాత్రలు పోషించారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 2 =