“F 3 ” మూవీ పై ఎంతో నమ్మకంగా ఉన్నా – మెహరీన్

Gorgeous Mehreen Super Confident about F3 Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Gorgeous Mehreen,Mehreen,Actress Mehreen,Mehreen Upcoming Movie,Mehreen New Movie F3,Mehreen Movie with Venaktesh,Mehreen About F3 Movie, Mehreen Confident about F3 Movie,F3 Movie,F3 telugu Movie,f3 Movie Updates,F3:Fun And Frustration Movie Updates,F3 Movie Latest news,F3 Movie Trailer Release,F3 Movie Trailer Released

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ , తమన్నా , మెహరీన్ ప్రధాన పాత్రలలో బ్లాక్ బస్టర్ “F 2:ఫన్ &ఫ్రస్టేషన్ ” మూవీ సీక్వెల్ గా తెరకెక్కిన “F 3” మూవీ మే 27 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో సోనాల్ చౌహాన్ ఒక కీలక పాత్రలో నటించారు. స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , దసరా స్పెషల్ వీడియో , “ఊ ఆ అహా అహా” సాంగ్ మేకింగ్ వీడియో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“F 2:ఫన్ &ఫ్రస్టేషన్ ” మూవీలో హనీ పాత్రలో యంగ్ బ్యూటీ మెహరీన్ మేనరిజం , అమాయకత్వం, అల్లరి.. ప్రేక్షకులని అలరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు రాబోయే “F3” మూవీ లో అంతకు మించిన వినోదాన్ని పంచబోతున్నట్లుగా మెహ్రీన్ తాజా ఇంటర్వ్యూలో చెప్పారు. మెహరీన్ మాట్లాడుతూ .. “F 2:ఫన్ &ఫ్రస్టేషన్ ” మూవీలోని తన పాత్రకి భిన్నంగా “F3” మూవీ లో తన పాత్ర ఉంటుందనీ , దర్శకుడు తన పాత్రని అద్భుతంగా డిజైన్ చేశారనీ , పూర్తి వినోదాత్మకంగా తన పాత్ర ఉంటుందనీ , ఈ పాత్ర తన కెరీర్‪లోనే ది బెస్ట్ ఎంటర్‌టైనర్ రోల్ కాబోతుందనే నమ్మకంతో ఉన్నాననీ , తన కెరీర్‌లో గుర్తుండిపోయే మరో సినిమా అవుతుందనీ చెప్పారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two − 2 =