తాప్సీ ‘శభాష్‌ మిథు’ రిలీజ్ డేట్ ఖరారు

Taapsee Shabaash mithu release date out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News,Actress Taapsee pannu Shabaash Mithu Movie Release Date Confirmed Taapsee pannu,Actress Taapsee pannu,Taapsee pannu Movie Shabaash Mithu Release Get Fixed,Shabaash Mithu Movie Release Date Fixed,Shabaash Mithu Get New Release Date, Taapsee Pannu Shabaash Mithu Movie Release Date Confirmed,Taapsee pannu Upcoming Movie Shabaash Mithu New Release Date Announced,Taapsee Pannu Shabaash Mithu Latest Updates, Shabaash Mithu Movie Updates,Shabaash Mithu New Movie Updates,Shabaash Mithu latest News,Taapsee Pannu Latest Updates From Shabaash Mithu Movie

ఈమధ్య కాలంలో బయోపిక్ ల హవా బాగా నడిచిన సంగతి తెలిసిందే కదా. ఎంతో మంది ప్రముఖుల బయోపిక్ లు తెరకెక్కాయి.. ఇప్పుడు కూడా వస్తూనే ఉన్నాయి. ఇక దీనిలో భాగాంగానే ఇప్పటికే ధోనితో పాటు పలువురు క్రికెటర్ల బయోపిక్ లు తెరపైకి రాగా ఇప్పుడు లేడీ క్రికెటర్ బయోపిక్ రాబోతుంది. తాప్సీ ప్రధాన పాత్రలో భారత మహిళా వన్డే క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ బయోపిక్‌ వస్తున్న సంగతి విదితమే. ఈ బయోపిక్ మిథాలీ జీవితానికి సంబంధించి.. తన క్రికెట్ ఆరంగేట్రం గురించి ఎన్నో కీలకమైన అంశాలను చూపించనున్నారు. ఇక ఈసినిమా ప్రస్తుతం అయితే రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను కూడా రిలీజ్ చేయగా టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. ఈసినిమాను జులై 15వ తేదీన రిలీజ్ చేయడానికి ఫిక్స్ అయ్యారు. ఈ విషయాన్ని తాప్సీ కూడా తన ట్విట్టర్ ద్వారా ఒక జెంటిల్ మెన్ గ్యామ్ లో ఒక అమ్మాయి తన కలలను ఒక బ్యాట్ తో ఎలా నిజం చేసుకుంది అన్న సారాంశమే ఈ కథ అంటూ తెలిపింది. రాహుల్ ధోలాకియా తెరకెక్కిస్తున్న ఈ సినిమాను వయాకామ్ 18 స్టూడియోస్ నిర్మిస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా మిథాలీ రాజ్ 1999లో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్ తో అరంగేట్రం చేసింది. తన 19 ఏళ్ల వయసులో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో 214 పరుగులు చేసి..అతి చిన్న వయసులో టెస్టుల్లో 200 పరుగులు చేసిన క్రికెటర్ గా అరుదైన గుర్తింపు సాధించారు. 23 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో మిథాలీ ఎన్నో రికార్డులను బద్దలు కొట్టారు. మిథాలీ భారత్ తరఫున 12 టెస్టులు, 230 వన్డేలు, 89 టీ20లు ఆడారు. టెస్టులలో 669, వన్డేలలో 7737, టీ20లలో 2364 పరుగులు చేశారు. మొత్తంగా 8 సెంచరీలు చేశారు.

ఇదిలా ఉండగా ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన తాప్సీ ఆ తరువాత పలు సినిమాల్లో నటించి మంచి విజయాలే దక్కించుకుంది. అయితే తెలుగులో క్రమంగా అవకాశలు తగ్గడంతో బాలీవుడ్ లో ట్రై చేసింది. ఇక అక్కడ మొదట పరిస్థితి అటూ ఇటూ ఉన్నా ఆ తరువాత
లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో వరుస విజయాలు అందుకుంటూ అక్కడ ఫైర్ బ్రాండ్ ఇమేజ్ సాధించింది. బాలీవుడ్ లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ సొంతం చేసుకొని వరసు అవకాలతో దూసుకుపోతుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three + eleven =