సూపర్ హిట్ “కిళక్కే పోగుమ్ రైల్ “(1978 ) మూవీ తో కోలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన రాధిక సూపర్ హిట్ “న్యాయం కావాలి “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన టాలెంటెడ్ యాక్ట్రెస్ రాధిక రజనీకాంత్ , కమల్ హాసన్ , చిరంజీవి , అమితాబ్ , జితేంద్ర , మమ్ముట్టి , విష్ణు వర్ధన్ వంటి స్టార్ హీరోలకు జంటగా నటించి పలు మూవీస్ కు బెస్ట్ యాక్ట్రెస్ గా అవార్డ్స్ అందుకున్నారు. నిర్మాత , దర్శకురాలిగా పలు టీవీ సీరియల్స్ ను రాధికా నిర్మించి నటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా సీనియర్ హీరోయిన్ రాధిక ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ .. “ఆర్ ఆర్ ఆర్ “మూవీ చూశాననీ , తారక్ , రామ్ చరణ్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారనీ , తారక్ తనకు ఇష్టమైన నటుడనీ , ఆ పేరు నచ్చి మా గ్రాండ్ సన్ కు తారక్ అని పేరుపెట్టామనీ , తారక్ మంచి నటుడే కాదు డ్యాన్సర్ కూడా అంటూ తారక్ ను ప్రశంసించారు. తారక్ తో నటించాలనే కల ఉందనీ , ఏ పాత్ర అయినా సరే నటించాలి అంతే అని చెప్పారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: