హార్రర్ అలర్ట్.. ‘పిశాచి 2’ టీజర్ రిలీజ్

Pisachi 2 Teaser Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Andrea Jeremiah And Vijay Sethupathi’s Pisachi 2 Telugu Teaser Out Now,Pisachi 2,Pisachi 2 Movie Updates,Pisachi 2 Telugu Movie Updates,Pisachi 2 Latest Movie Updates,Pisachi 2 Upcoming movie Updates,Pisachi 2 latest News, Pisachi 2 Telugu Movie Teaser,Pisachi 2 Movie Teaser,Pisachi 2 Telugu movie Teaser Out Now,Andera Jeremiah and Vijay Sethupathi Movie Pisachi 2 Treaser Out Now

త‌మిళ డైరెక్ట‌ర్ మిస్కిన్ దర్శకత్వంలో వచ్చిన పిశాచి సినిమా ఎంత ఘనవిజయం సాధించిందో తెలిసిందే కదా. హ‌ర్ర‌ర్ థ్రిల్ల‌ర్‌గా అసలు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈసినిమా అప్పట్లో బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యాన్ని సాధించింది. ఇక ఇప్పుడు దాని సీక్వెల్ పిశాచి2 తో వచ్చేస్తున్నాడు మిస్కిన్. ఈసీక్వెల్ ను మిస్కిన్ ఎప్పుడో ప్రకటించాడు కానీ సెట్స్ పైకి వెళ్లడానికే చాలా టైమే పట్టింది. అయితే మద్యలో క‌రోనా కూడా రావడంతో షూటింగ్ ఆల‌స్య‌మువుతూ వ‌చ్చింది. ప్ర‌స్తుతం షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా చిన్నగా మొదలుపెట్టారు. ఈనేపథ్యంలో ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో ఆండ్రియా ప్రధాన పాత్రలో నటిస్తుండగా పూర్ణ , సంతోష్ ప్రతాప్ , అజ్మల్ అమీర్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. “మక్కల్ సెల్వన్”విజయ్ సేతుపతి” కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. కార్తీక్ రాజా సంగీతం అందిస్తున్నారు. రాక్ ఫోర్ట్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు.  తెలుగులో ఈ చిత్రాన్ని దిల్‌రాజు విడుద‌ల చేస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + twenty =