పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఎవర్ గ్రీన్ సినిమా ఏదంటే అందరికీ ఖుషి సినిమానే ముందు గుర్తొస్తుంది. ఎస్ జే సూర్య దర్శకత్వంలో వచ్చిన ఈసినిమా పవర్ కెరీర్ కే టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. ఇందులో పవన్ మ్యానరిజం, స్టైల్ అన్నీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. 2001 ఏప్రిల్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అప్పటికే వరుస విజయాలతో మంచి ఫామ్‌లో ఉన్న పవన్ స్థాయిని ఆకాశానికి ఎత్తేసింది. ఇక ఈ సినిమాలో పవన్‌కు జోడిగా భూమికా చావ్లా నటించింది. వీరిద్దరి కాంబినేషన్ సూపర్. ఇద్దరి మధ్య ప్రేమ ఉన్నా .. ఎప్పుడూ గొడవ పడే పాత్రల్లో ఇద్దరూ చేసిన నటన యూత్ ను బాగా ఆకట్టుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా తాజాాగా 21 ఏళ్లను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా భూమిక తన ట్విట్టర్ ద్వారా మరోసారి ఈసినిమాను గుర్తుచేసుకున్నారు. . ‘ఖుషికి 21 ఏళ్లు. ఎన్నో జ్ఞాపకాలతో కూడిన అద్భుతమైన ప్రయాణం. ఈ సినిమా నన్ను భూమిక నుండి మధుగా మార్చేసింది. నా సినీ కెరీర్‌లోనే చాలా ఇష్టపడే క్యారెక్టర్ ఇది.’ అంటూ తెలిపింది. ఇంకా చిత్రయూనిట్ ను కూడా ట్యాగ్ చేస్తూ వారికి కూడా థ్యాంక్య్ చెప్పింది.
21 YEARS OF KUSHI . Full of Memories & an incredible journey The movie that made Bhumika — Madhu 💕 one of the most adored , loved characters of my Film career . 🙏 A. M Ratnam Sir ,Dir S.J Suryah @IamSjsuryah Pawan Kalyan Garu – @PawanKalyan &Brinda master @BrindaPrasad1 pic.twitter.com/uaD5XSj9W3
— Bhumika Chawla — Just B (@bhumikachawlat) April 26, 2022
కాగా ఈసినిమాలో శివాజీ, నాజర్, విజయ్ కుమార్, సుధ, అలీ, రాజన్ పి.దేవ్, ముంతాజ్, జానకి సబేష్, అజయ్ ముఖ్య పాత్రల్లో నటించారు. మణిశర్మ సంగీతం అందించిన ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ను ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం నిర్మించాడు.
ప్రస్తుతం అయితే భూమిక సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేసింది. ఒకప్పుడు స్టార్ హీరోలందరితో నటించిన భూమిక కొంత కాలం సినిమాలకు దూరమైంది. ఇక ఇప్పుడిప్పుడే మళ్లీ పలు సినిమాల్లో కీలకపాత్రల్లో నటిస్తూ మళ్లీ కెరీర్ లో బిజీ అవుతుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: