అఫీషియల్.. రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన ‘కృష్ణ వ్రింద విహారి’

Krishna Vrinda Vihari gets a new release date,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Krishna Vrinda Vihari,Krishna Vrinda Vihari Movie,Krishna Vrinda Vihari Telugu Movie,Krishna Vrinda Vihari latest Movie Updates,Krishna Vrinda Vihari Movie Release Date Updates, Krishna Vrinda Vihari Movie Gets New Release Date,Krishna Vrinda Vihari Release Date Confirmed May 20th,Krishna Vrinda Vihari Movie releasing On may 20th, Krishna Vrinda Vihari Release Date officially Announced on 20th May

యంగ్ హీరో నాగశౌర్య కూడా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నాడు. అంతేకాదు తానే స్వయంగా ప్రొడక్షన్ హౌస్ ను కూడా స్థాపించి సినిమాలు కూడా నిర్మిస్తున్నాడు. ఇక ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉండగా త్వరలో రిలీజ్ కు సిద్దంగా ఉన్న సినిమా మాత్రం కృష్ణ వ్రింద విహారి. అనీష్​ కృష్ణ దర్శకత్వంలో నాగశౌర్య ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా కృష్ణ వ్రింద విహారి ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకొని రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన పాటలు అలానే టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. నిజానికి ఈ సినిమాను ఏప్రిల్ 22న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో రిలీజ్ చేయాలనుకున్నారు మేకర్స్. కానీ అప్పుడు వాయిదా వేశారు. ఆ తర్వాత మే 20 న రిలీజ్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు తాజాగా రిలీజ్ డేట్ ను కన్ఫామ్ చేశారు మేకర్స్. మే 20నే ఈసినిమాను రిలీజ్ చేస్తున్నట్టు నేడు తమ ట్విట్టర్ ద్వారా పోస్టర్ రిలీజ్ చేస్తూ తెలియచేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో షిర్లే సెటియా హీరోయిన్ గా నటిస్తుండగా.. రాధిక, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, సత్య, బ్రహ్మాజీ తదితరులు పలు కీలక పాత్రల్లో నటించనున్నారు. ఐరా క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై ఉషా ముల్పూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్ సంగీతం అందిస్తుండగా.. సాయి శ్రీరామ్ కెమెరామెన్‌గా పని చేస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + one =