‘అశోకవనంలో అర్జున కళ్యాణం’.. మళ్లీ మారిన రిలీజ్ డేట్.. కొత్త డేట్ ఫిక్స్..!

Ashokavanamlo Arjuna Kalyanam gets New Release Date,Vishwak Sens Ashokavanamlo Arjuna Kalyanam Gets A New Release Date,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Vishwak Sen,Hero Vishwak Sen,Vishwak Sen Upcoming Movie,Vishwak Sen latest Movie Updates,Vishwak Sen Ashokavanamlo Arjuna Kalyanam movie updates,Ashokavanamlo Arjuna Kalyanam latest Movie Updates, Ashokavanamlo Arjuna Kalyanam Releasing on May 6th,Vishwak Sen Ashokavanamlo Arjuna Kalyanam Releasing on May 6th,Ashokavanamlo Arjuna Kalyanam Release Date Fixed,Ashokavanamlo Arjuna Kalyanam gets New Release Date,Ashokavanamlo Arjuna Kalyanam New Release Date Announced Soon

విద్యాసాగర్ దర్శకత్వంలో యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా వస్తున్న సినిమా అశోకవనంలో అర్జున కళ్యాణం. ఇప్పటి వరకూ మాస్ పాత్రలు, అలానే లవర్ బాయ్ పాత్రల్లో అలరించిన విశ్వక్ సేన్ ఈసినిమాతో మరో కొత్త పాత్ర ద్వారా అలరించడానికి వచ్చేస్తున్నాడు. వయసు దాటుతున్నా ఇంకా పెళ్ళికాని అల్లం అర్జున కుమార్ తన పెళ్లి కోసం ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు అన్న కథాంశంతో ఈసినిమా వస్తుంది. ఇక ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతుంది. అయితే ఎప్పుడో ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకున్నా ఇంతవరకూ రిలీజ్ కాలేకపోయింది. అంతేకాదు ఇప్పటికే రెండుమూడుసార్లు రిలీజ్ డేట్లను కూడా మార్చారు. ఈసినిమాను ముందు మార్చి లో రిలీజ్ చేద్దామనుకున్నారు. ఆతరువాత ఏప్రిల్ 22న ఈసినిమాను రిలీజ్ చేస్తున్నట్టు కొత్త రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. కానీ ఇప్పుడు ఈ డేట్ లో కూడా సినిమా రిలీజ్ కావడంలేదు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను పోస్ట్ పోన్ చేస్తూ మేకర్స్ అప్ డేట్ ఇచ్చారు. ఏప్రిల్ 22న ఈసినిమా రిలీజ్ కావల్సి ఉండగా కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు. మే 6వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఈసినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు తెలిపారు.

కాగా రుక్సార్‌ దిల్లాన్‌ ఈసినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈసినిమాను ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బాపినీడు, సుధీర్ నిర్మిస్తున్నారు. జయ ఫణి సంగీతం అందిస్తున్నాడు. సినిమాటోగ్రాఫర్ గా ప‌వి కె.ప‌వ‌న్‌ పనిచేస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.