మీకు నచ్చిన డీ గ్లామరస్ హీరోయిన్..?

Which Heroine Performance In Deglamour role impressed you the most,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Heroines,Heroine Performance,Which Heroine Performance In Deglamour role impressed you,Best Heroine,Rashmika Mandanna,Samantha Ruth Prabhu,Rakul Preet Singh,Rashmika Mandanna Best Performance in Pushpa Movie, Rashmika Mandanna In Pushpa,National Crush Rashmika Mandanna,Samantha Ruth Prabhu Best performance Movie,Samantha Ruth Prabhu Movies,Samantha Ruth Prabhu latest Updates,Samantha Ruth Prabhu Movie Updates,Samantha Ruth Prabhu Upcoming Movies, Rakul Preet Singh,Rakul Preet Singh Super Hit Movies,Rakul Preet Singh latest Movies,Rakul Preet Singh new Movie Updates,Rakul Preet Singh upcoming Movies

ప్రస్తుతం సినీ పరిశ్రమల్లో చాలా మార్పులు వచ్చిన సంగతి తెలిసిందే కదా. హీరోలు ఎలాగైతే ప్రయోగాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో హీరోయిన్ లు అలానే ప్రయోగాలు చేయడానికి చూస్తున్నారు. ఒకప్పుడు గ్లామర్ రోల్స్ కు మాత్రమే పరిమితమైన హీరోయిన్స్ ఇప్పుడు మాత్రం లేడీ ప్రధానమైన పాత్రలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంతేకాదు డీ గ్లామర్ పాత్రలు చేయడానికి కూడా రెడీ అయిపోతున్నారు. ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ ఆ దిశగా అడుగులు కూడా వేశారు. కెరీర్ ప్రారంభించిన కొన్నిరోజులు గ్లామర్ రోల్స్ చేసినా ఇప్పుడు మాత్రం డిఫరెంట్ రోల్స్ కే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. కథలో బలం ఉంటే హీరోయిన్స్ డీ గ్లామర్ పాత్రలు చేసినా ఆడియన్స్ అంగీకరిస్తారన్న విషయం నిరూపిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత డీ గ్లామర్ రోల్ లో నటించిన సినిమా రంగస్థలం. నిజానికి సమంత మొదటి నుండి కాస్త డిఫరెంట్ రోల్స్ చేయడానికే ఇంట్రెస్ట్ చూపిస్తుంటుంది. ఎలాంటి స్కిన్ షో లేకుండానే తన మొదటి సినిమా ఏ మాయ చేశావే సినిమాతో అందరినీ మాయ చేసేసింది. ఆ తర్వాత పలు గ్లామర్ రోల్స్ చేసినా తరువాత పాత్ర ప్రధానమైన రోల్స్ ఎంచుకోవడానికే మొగ్గుచూపించింది. ఇక రంగస్థలం సినిమాలో డీ గ్లామర్ పాత్రలో కూడా చాలా చక్కగా నటించి మెప్పించింది.

కెరీర్‌ ఆరంభించిన మొదట్లో రకుల్‌ చేసినవన్నీ గ్లామరస్‌ పాత్రలే. అందుకే ‘గ్లామరస్‌ హీరోయిన్‌’ అనే స్టాంప్‌ బలంగా పడిపోయింది. అయితే ఆ మార్క్ ను కొండపొలం సినిమాతో చెరిపేసింది. ‘కొండపొలం’ సినిమాలో గొర్రెల కాపరి ఓబులమ్మగా డీ గ్లామర్ పాత్రలో కనిపించి మెప్పించింది.

ఇక రష్మిక కూడా పుష్ప సినిమాలో డీ గ్లామర్ రోల్ లో నటించి మంచి మార్కులే కొట్టేసింది. ఒకవైపు స్టార్ హీరోయిన్‌గా దూసుకెళుతున్నా కూడా గ్లామర్‌ ఇమేజ్‌ ను సైతం పక్కన పెట్టి పుష్ప సినిమాలో డీగ్లామర్ పాత్రలో నటించి అచ్చమైన పల్లె పిల్లలా కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచింది ఈ కన్నడ బ్యూటీ.

మరి ఈ ముగ్గురిలో మీకు బాగా నచ్చిన డీ గ్లామరస్ హీరోయిన్ ఎవరో మీ ఓటు ద్వారా చెప్పండి.

మీకు నచ్చిన డీ గ్లామరస్ హీరోయిన్..?

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × two =