‘హనుమాన్’ తో ‘రామ రాజు’..!

Chiranjeevi shares an adorable video of Ram Charan from Acharya Sets,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Chiranjeevi,Mega Star Chiranjeevi,Chiranjeevi shares an adorable video,Chiranjeevi shares an adorable video of Ram Charan,Chiranjeevi shares Video in Social Media,Chiranjeevi shares video Of Ram charan in social Media, Chiranjeevi in Social Media,Chiranjeevi upcoming Movie,Chiranjeevi latest Movie Updates,Chiranjeevi Acharya Movie Updates,Chiranjeevi and Ramcharan Acharaya Movie Update

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సక్సెస్ తో మంచి జోష్ లో ఉన్నారు. ఈసినిమాతో ఒక్క సారిగా పాన్ ఇండియా స్టార్ రేసులోకి చరణ్ కూడా వచ్చేశాడు. మల్టీస్టారర్ గా వచ్చిన ఈసినిమాలో రామ్ చరణ్ నటనకు కూడా మంచి ప్రశంసలు దక్కాయి. సౌత్ లో మాత్రమే కాదు నార్త్ లో కూడా చరణ్ కు మంచి క్రేజ్ పెరిగింది. మరోవైపు తండ్రి మెగాస్టార్ తో కలిసి నటించిన ఆచార్య సినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఈ నెల 29న ఈసినిమా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా నేడు హనుమాన్ జయంతి ఈ సందర్భంగా చరణ్ తన సోషల్ మీడియా ద్వారా ఒక క్యూట్ వీడియోను షేర్ చేసుకున్నారు. ఈ వీడియో ఆచర్య సినిమా షూటింగ్ అప్పుడు అన్న విషయం అర్థమవుతుంది. ఇక వీడియోలో చరణ్ ఆచార్య షూటింగ్ కోసం మేకప్ వేసుకుంటున్నారు. అంతలోనే ఆయన వద్దకు వానరం వచ్చింది. రామ్ చరణ్ చక్కగా మేకప్ వేసుకుంటున్న క్రమంలో ఆయన్నే చూస్తూ ఉంది. ఇంతలో చరణ్ తన వద్ద ఉన్న బిస్కట్స్ వానరానికి ఇవ్వగా వాటిని తినేసింది. ఇక ఈవీడియోను నేడు హనుమాన్ జయంతి స్పెషల్ గా రిలీజ్ చేయగా నెటిజన్లు చూసి ఫిదా అవుతున్నారు. మరి చిరు ఆంజనేయుడి భక్తుడన్న సంగతి అందరికీ తెలిసిందే కదా.

ఇక ప్రస్తుతం అయితే తను తన తరువాత ప్రాజెక్ట్ అయిన శంకర్ సినిమాతో జిజీ అయిపోయాడు. కియారా అద్వాని హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాలో శ్రీకాంత్, జయరామ్, అంజలి, సునీల్, నవీన్ చంద్ర కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈసినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈసినిమాను తమిళ్, తెలుగు, హిందీలో చిత్రీకరిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.