యాంకరింగ్ లో సరిలేరు నీకెవ్వరు అన్న ట్యాగ్ లైన్ సుమ కు కరెక్ట్ గా సెట్ అవుతుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన వాక్చాతుర్యం.. చమత్కారంతో యాంకర్ గా తనకు సాటి మరెవరూ అన్న రేంజ్ లో సుమ గుర్తింపు తెచ్చుకుంది. బుల్లితెరపై స్టార్ యాంకర్ గా రాణిస్తున్నా.. మరోపక్క ఏ సినిమా ఈవెంట్స్ ఉన్నా అందులో మొదటి ఆప్షన్ సుమదే. పెద్ద పెద్ద పాన్ ఇండియా సినిమా ఈవెంట్ల దగ్గర నుండి చిన్న సినిమాల వరకూ అందరికీ ఫస్ట్ ఛాయిస్ సుమనే. ఇక ఇంతకాలం టెలివిజన్ లో సినిమాల ప్రీ రిలీజ్ ఫంక్షన్లలో ప్రేక్షకులను, ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలను అలరించిన సుమ.. ఇక వెండితెరపైన ప్రేక్షకులను అలరించడానికి రెడీగా ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వంలో సుమ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా జయమ్మ పంచాయితీ. ఇప్పటికే ఈసినిమా నుండి పలు పాటలు, టీజర్ రిలీజ్ అవ్వగా అవి అందరినీ ఆకట్టుకున్నాయి. ఇప్పటి వరకూ ఈసినిమాకు పెద్ద పెద్ద హీరోల సపోర్ట్ బాగానే దక్కింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయగా న్యాచురల్ స్టార్ నాని ఫస్ట్ సింగిల్, రానా దగ్గుబాటి ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ఈ సినిమా టైటిల్ సాంగ్‌ను రిలీజ్ చేయగా ఇప్పుడు ఏకంగా పవర్ స్టార్ కూడా జయమ్మ పంచాయితీ కి సపోర్ట్ ఇచ్చారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా నేడు ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
జయమ్మ పంచాయతీ కి ఎందుకు వెళ్ళింది? అసలు ఈ ఈడ్లు గొడవ ఏంటి 🧐@ItsSumaKanakala‘s #JayammaPanchayathi Trailer released by POWER STAR @PawanKalyan
▶️https://t.co/FoOjaDbp1R@mmkeeravaani @VijayKalivarapu @PrakashBalaga @vennelacreation @adityamusic#JayammaPanchayathiOnMay6th pic.twitter.com/GX4GxpOmgM— Balaga Prakash (@PrakashBalaga) April 16, 2022
కాగా వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బలగ ప్రకాష్ నిర్మిస్తున్న ఈసినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందించగా, అనూష్ కుమార్ సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. ఇక ఈసినిమా ఈ నెల 22న రావాల్సి ఉంది.. అయితే కొన్ని కారణాలవల్ల వాయిదా పడింది. తాజాగా రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు. మే 6న మూవీని రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ తెలిపారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























