సందీప్ కిషన్ సినీ ‘ప్రస్థానం’ కి 12 ఏళ్లు

12 Years for Sundeep Kishan in Tollywood,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Sundeep Kishan,Hero Sundeep Kishan,Actor Sundeep Kishan,Tollywood Hero Sundeep Kishan,Sundeep Kishan Movies,Sundeep Kishan upcoming Movies,Sundeep Kishan new Movies, Sundeep Kishan Latest Movies,Sundeep Kishan Latest Movie Updates,Sundeep Kishan Completes 12 Years in Tollywood,12 years for Sundeep Kishan in Tollywood

ఎంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నా కానీ టాలెంట్ లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో సినీ అనుభవం ఉన్న వారికి తెలియంది కాదు. బ్యాక్ గ్రౌండ్ తో ఎంట్రీ ఇవ్వడం ఈజీ ఏమో కానీ సరైన కథలు, నటన రాకపోతే మాత్రం ప్రేక్షకులు ఎలాంటి మొహమాటం లేకుండా రిజల్ట్ చూపిస్తారు. సినీ ఇండస్ట్రీల్లో వారసత్వంతో ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోలు అయిన వాళ్లు ఉన్నారు. అడ్రస్ లేకుండా పోయిన వాళ్లు కూడా ఉన్నారు. ఇక మన తెలుగులో కూడా ఎంతోమంది అలా వచ్చిన వాళ్లు ఉన్నారు. కొంతమంది మాత్రం సక్సెస్ ను సాధించకపోయినా కొంతమంది మాత్రం కెరీర్ లో రాణిస్తూనే ఉన్నారు. ఇక ఆ లిస్ట్ లో యంగ్ హీరో సందీప్ కూడా ఉన్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సందీప్ కిషన్ ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఛోటా కే నాయుడు మేనల్లుడు అన్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్థానం సినిమాతో సినిమా ఇండస్ట్రీలో తన ప్రస్థానం మొదలుపెట్టాడు సందీప్ కిషన్. మొదట్లో కాస్త మామ పేరు ఉపయోగపడిందేమో కానీ ఇప్పుడు మాత్రం సందీప్ కు ఆ అవసరం లేకుండానే తను తెచ్చుకున్న గుర్తింపుతోనే సినిమా అవకాశాలను దక్కించుకుంటున్నాడు. ఆయన నటించిన మొదటి సినిమా ‘ప్రస్థానం’ 2010 ఏప్రిల్ ‌16న విడుదలైంది. ఇందులో చిన్నా అనే పాత్ర పోషించి తొలి ప్రయత్నంలోనే నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సాయి కుమార్‌, శర్వానంద్‌ ప్రధాన పాత్రల్లో దేవ కట్టా తెరకెక్కించిన చిత్రమది. రాజకీయ నేపథ్యంలో యాక్షన్‌ డ్రామాగా రూపొందిన ఆ సినిమాలో సాయి కుమార్‌ తనయుడిగా కనిపించి ఆకట్టుకున్నాడు. నేటితో ఈసినిమాతో సందీప్ కిషన్ ప్రస్థానానికి 12 ఏళ్లు అయింది.

ఇక ఈ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించాడు సందీప్ కిషన్. స్నేహ గీతం’, ‘రొటీన్‌ లవ్ స్టోరీ’, ‘గుండెల్లో గోదారి’ లాంటి ఎన్నో విభిన్న కథలను చేసినా ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’ చిత్రంతో కమర్షియల్‌ హిట్‌ అందుకున్నాడు. ఇక ఆ తర్వాత లవ్‌ స్టోరీలు చేస్తూనే కథాబలం ఉన్న చిత్రాల్లో నటించి తనను తాను నిరూపించుకున్నాడు. హీరో గా మాత్రమే కాదు ఇప్పుడు సొంత బ్యానర్ కూడా ఏర్పాటు చేసుకొని నిర్మాతగా కూడా మారిపోయాడు. ప్రస్తుతం తెలుగులో వీఐ ఆనంద్ దర్శకత్వంలో సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ నేపథ్యంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈసినిమాతో పాటు సందీప్ కిషన్ మైఖేల్ అనే సినిమాను కూడా చేస్తున్నాడు. ఇంకా తెలుగు పాటు తమిళ్ లో కూడా ఛాన్స్ లు దక్కించుకుంటూ కెరీర్ ను సక్సెస్ ఫుల్ గా సాగిస్తున్నాడు. మరి ముందు ముందు సందీప్ ఇలానే ఎన్నో సినిమాలను తీసి మంచి మంచి హిట్ లను అందుకోవాలని కోరుకుందాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 − one =