శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా దసరా సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమాలో నాని ఫుల్ మాస్ రోల్ లో కనిపించబోతున్నాడు. ఇక ఈసినిమా ప్రస్తుతం గోదావరిఖనిలో షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే కదా. అక్కడ పలు కీలక సన్నివేశాలతో పాటు ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ ఆధ్వర్యంలో దాదాపు 500 మంది డ్యాన్సర్లతో ఒక పాట కూడా చిత్రీకరిస్తున్నట్టు ఇప్పటికే వార్తలు కూడా వచ్చాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే తాజా సమాచారం ప్రకారం ఈ షూటింగ్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. అదేంటంటే.. గోదావరిఖని ఊరి మొత్తాన్ని దసరా టీమే అక్రమించేసిందంటూ వార్తలు వస్తున్నాయి. అసలు సంగతేంటంటే.. ఈసినిమా షూటింగ్ సందర్భంగా జూనియర్ ఆర్టిస్టులు, డ్యాన్సర్లు అక్కడే ఉండాల్సి వచ్చింది. అయితే గోదావరిఖని చిన్న పట్టణం కావడంతో ఎక్కువ హోటల్స్ కూడా లేకపోవడంతో అక్కడ ఉన్న ప్రభుత్వ వసతి గృహాలు, కల్యాణ మండపాలతోపాటు ఇతర ప్రైవేట్ స్థలాలను కూడా బుక్ చేశారట ప్రొడక్షన్ టీమ్. ఈనేపథ్యంలో దసరా టీమ్ గోదావరిఖనిని ఆక్రమించేశారని వార్తలు వస్తున్నాయి.
కాగా ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా.. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. ఈసినిమాను కూడా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: