భారీ ప్రమోషన్స్ కు సిద్దమవుతున్న ‘సర్కారు వారి పాట’

Sarkaru Vaari Paata Latest Update,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Sarkaru Vaari Paata,Sarkaru Vaari Paata Telugu movie,Sarkaru Vaari Paata Movie,Sarkaru Vaari Paata Movie Updates,Sarkaru Vaari Paata Latest Movie updates, Sarkaru Vaari Paata Promotions,Sarkaru Vaari Paata Mahesh babu Upcoming Movie,Mahesh babu Latest Upcoming movie Sarkaru Vaari Paata,Sarkaru Vaari Paata Team Planning For Huge Promotions, Sarkaru Vaari Paata All set For huge Movie Promotions,Sarkaru Vaari Paata Promotions,Mahesh Babu Sarkaru Vaari Paata Promotions,Sarkaru Vaari Paata latest Updates About Movie Promotions

పరుశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వస్తున్న సినిమా సర్కారు వారి పాట. యాక్షన్ ఎంటర్ టైన్ మెంట్ గా ఈసినిమా తెరకెక్కుతుంది. బ్యాంకుల కుంభకోణం నేపథ్యంలో ఈసినిమా రానుందని ఇప్పటికే పలు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా వచ్చే నెల అంటే మే 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. అంటే ఈరోజు నుండి నెల రోజులు టైమ్ ఉంది. దీంతో చిత్రయూనిట్ కూడా మాసివ్ ప్రమోషన్స్ ను చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. నిజానికి ఇప్పటికే ఈసినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టారు. అయితే అప్పుడప్పుడూ అప్ డేట్స్ ఇస్తూ వస్తున్నారు. ముందు పోస్టర్లు, ఆ తరువాత బ్లాస్టర్ అంటూ చిన్న గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇక ఈమధ్యనే మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. దీనిలో భాగంగానే ఇప్పటివరకూ రెండు పాటలు రిలీజ్ చేయగా రెండు పాటలు క్రేజీ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. త్వరలో మూడో పాటను రిలీజ్ చేయనున్నారు. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుంది. ఈనెల రోజుల్లో వీలైనంత ఎక్కువగా ప్రమోషన్స్ చేయడానికి మేకర్స్ రంగం సిద్దం చేస్తున్నారు. త్వరలోనే ఆ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేయనున్నట్టు తెలుస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా పూర్తిగా కమర్షియల్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కిస్తున్న ఈసినిమాలో మహేష్ సరికొత్త లుక్ లో కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ చివరిదశలో ఉంది. ఒకపక్క షూటింగ్ పూర్తి చేసుకుంటూనే మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ముగించుకుంటుంది. ఈసినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా.. సముద్రఖని మరో కీలక పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్‌ ప్లస్, జీయంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్లు సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నాయి. థమన్ ఈసినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 + six =