సక్సెస్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా ఇప్పుడు చాలా మంది టాలీవుడ్ యంగ్ హీరోలందరూ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. అందులో ఆది సాయికుమార్ కూడా ఉన్నాడు. ఆది సాయికుమార్ కూడా ప్రస్తుతం వరుస సినిమాలతో కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే చాలా సినిమాలు ఆది లిస్ట్ లో ఉన్నాయి. విడుదల కావాల్సిన సినిమాలు, సెట్స్ పై ఉన్న సినిమాలు దాదాపు నాలుగైదు ఉండగానే తాజాగా మరో చిత్రానికి ఆది సాయికుమార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈసినిమాను నిన్ననే పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు చిత్రయూనిట్. శశికాంత్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను ఆదిత్య మూవీస్ ఎంటర్ టైన్ మెంట్ సమర్పణలో కేవీ శ్రీధర్ రెడ్డి నిర్మిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఫణికృష్ణ సిరి దర్శకత్వంలో ఆది సాయి కుమార్ ఒక సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు తాజాగా ఈసినిమా టైటిల్ ను రిలీజ్ చేశారు మేకర్స్. క్రేజీ ఫెలో అనే టైటిల్ ను ఈసినిమాకు ఫిక్స్ చేస్తూ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. టైటిల్ ని ప్రకటిస్తూ ఓ వీడియోని విడుదల చేసింది చిత్రయూనిట్. సినిమాలో హీరో ఆది సాయికుమార్ చాలా డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు.
We are very much Happy to share our movie name with you all.
⭐ing @AadiSaikumar @DiganganaS @mirnaaofficial
🎞️@SriSathyaSaiArt
🎬@siriki_phani
🎹#RRDhruvan
🎥#SatishMutyala
✂️@GiduturiSatya
💰@KKRadhamohan
🎧@adityamusic
📰@UrsVamsiShekar pic.twitter.com/HLsXGdMuQm— Sri Sathya Sai Arts (@SriSathyaSaiArt) April 8, 2022
కాగా ఔట్ అండ్ ఔట్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో ఆది సాయికుమార్ సరసన దిగాంగన సూర్యవన్షీ, మిర్నా మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై కె.కె. రాధామోహన్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఆర్ ఆర్ ధృవ సంగీతం అందిస్తున్నాడు. సతీష్ ముత్యాల ఫొటోగ్రఫీ అందిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.