గతేడాది ‘మాస్టర్’ మూవీతో సూపర్ హిట్ అందుకున్న తమిళ్ స్టార్ హీరో దళపతి విజయ్ ఇప్పుడు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ‘బీస్ట్’ మూవీ చేస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ సరసన మొదటి సారి పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. డార్క్ కామెడీ థ్రిల్లర్ గా ఈసినిమా తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో మాస్, క్లాస్ ఆడియెన్స్ మెచ్చే విధంగా చిత్ర యూనిట్ తీర్చిదిద్దుతోంది. దీంతో బీస్ట్ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఏప్రిల్ 13న ఈసినిమా రిలీజ్ కాబోతుంది. ఈనేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్స్ లో స్పీడు పెంచారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన మొదటి సాంగ్ అరబిక్ కుతు పెద్ద హిట్టైంది. 200 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకొని రికార్డులు క్రియేట్ చేసింది. రీసెంట్ గా ఈ సినిమా నుంచి రెండో సింగిల్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. జాలీ ఓ జింఖానా అంటూ సాగే ఈ పాటను హీరో విజయ్ పాడడం విశేషం. ఇక ఇప్పుడు ఈసినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ ను చేయడానికి కూడా రెడీ అయ్యారు. ఉగాది పండుగ సందర్భంగా ఏప్రిల్ 2వ తేదీన సాయంత్రం 6గంటలకు ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు.
The much-awaited #BeastTrailer is releasing on April 2nd @ 6 PM
Namma aattam inimey vera maari irukum 🔥@actorvijay @Nelsondilpkumar @anirudhofficial @hegdepooja @selvaraghavan @manojdft @Nirmalcuts @anbariv #BeastTrailerOnApril2 #BeastModeON #Beast pic.twitter.com/EtpNDVKv4L— Sun Pictures (@sunpictures) March 30, 2022
కాాగా ఈసినిమాలో సెల్వ రాఘవన్ నెగెటివ్ రోల్ లో నటించనుండగా.. యోగిబాబు మరో కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమాను పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. తమిళంతో పాటు తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్నారు. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: