దర్శకధీరుడు రాజమౌళి సినిమా అంటే ఆ సినిమా ఖచ్చితంగా హిట్ అని ముందే ఫిక్స్ అయిపోతారు ఆడియన్స్. ఇక ఇండస్ట్రీలో ఉన్న ప్రతి హీరో కూడా ఒక్కసారైనా రాజమౌళి దర్శకత్వంలో చేయాలని కోరుకుంటారు. కానీ కొంతమందికి మాత్రమే ఆ అవకాశం దక్కుతుందనుకోండి. ఇకసాధారణంగా ఒక సినిమాకు హిట్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ హిట్ అనే సమీకరణాలు ఉంటాయి. కానీ ఇప్పుడు ఆ స్థాయి దాటిపోయాడు రాజమౌళి. ఇప్పుడు తను ఏ సినిమా తీసినా అది సంచలనమే అన్న రేంజ్ కు ఎదిగిపోయాడు. మొదటి నుండి కమర్షియల్ సినిమా తీసినా ఆడియన్స్ కు ఏదైనా కొత్తదనం చూపించాలి అని రాజమౌళి ఎప్పుడూ ఆలోచిస్తాడు కాబట్టే తను చేసే ప్రతి సినిమాలో ఏదో ఒక కొత్త దనం కనిపిస్తుంది. ఈగ సినిమాతో ఈగతో కూడా సినిమా చేయచ్చని చూపించాడు.. అలానే మగధీర లాంటి క్లాసిక్ మూవీ ఆ తర్వాత వచ్చిన బాహుబలి సిరీస్ గురించి అయితే చెప్పనక్కర్లేదు. బాహుబలి లాంటి సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచస్థాయికి తెలిసేలా చేశాడు. ఇక ఇప్పుడు మరో సంచలనానికి రెడీ అవుతున్నాడు. ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి ఇద్దరు స్టార్ హీరోలతో ఆర్ఆర్ఆర్ అనే క్రేజీ మల్టీస్టారర్ తో వచ్చేస్తున్నాడు. ఫిక్షనల్ కథగా తెరకెక్కిన ఈసినిమా మార్చి 25న రిలీజ్ కాబోతుంది. మరి ఈసినిమా ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో తెలియాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే..
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మరి కింద ఇచ్చిన సినిమాల్లో మీకు బాగా నచ్చిన రాజమౌళి సినిమా ఏదో మీ ఓటు ద్వారా తెలియచేయండి.
[totalpoll id=”77029″]
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: