ఇటీవల దర్శకులు, నిర్మాతలు భారీ బడ్జెట్ తో సినిమాలు తీయడానికి అస్సలు వెనుకాడట్లేదు. కథ డిమాండ్ చేస్తే ఎన్ని కోట్లయినా పెట్టడానికి రెడీగా ఉన్నారు. అందుకే విజువల్ వండర్స్ ను తెరపైన చూడగలుగుతున్నాం. ఇక టాలీవుడ్ లో ఇప్పటికే అలాంటి సినిమాలు రాగా.. ఇప్పుడు బాలీవుడ్ లో బ్రహ్మాస్త్ర విజువల్ వండర్ ను చూపించడానికి రెడీ అవుతుంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణ్‌బీర్‌కపూర్, అలియా భట్ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా బ్రహ్మాస్త్ర. ఈసినిమాలో రణ్‌బీర్‌కపూర్ శివ పాత్రలో నటిస్తుండగా అలియా ఇషా పాత్రలో కనిపించనుంది. ఇక ఈసినిమా ఎప్పుడో షూటింగ్ ను పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దమవుతుంది. రెండు పార్ట్ లుగా రానున్న ఈసినిమాలో మొదటి పార్ట్ ను సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా ప్రమోషన్స్ ను కూడా చిన్నగా స్టార్ట్ చేస్తున్నారు మేకర్స్. ఇదిలా ఉండగా ఈసినిమా నుండి అలియా పుట్టినరోజు సందర్భంగా తన పాత్రకు సంబంధించి స్పెషల్ వీడియోను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇక ఈవీడియోపై దర్శకధీరుడు రాజమౌళి స్పందిస్తూ.. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి.. అలియా భట్ ఎప్పటిలాగే చాలా బాగా నటించింది.. దర్శకుడు అయాన్ ముఖర్జీ ఈ చిత్రం లో ఏమి దాచి ఉంచాడో చూడాలి అంటూ ట్వీట్ చేశారు. ఇక రాజమౌళి ట్వీట్ కు అలియా కూడా స్పందించి థ్యాంక్స్ చెప్పింది.
Sirrr!!! You’re the best thank you for this 🙏 https://t.co/GJDfmGT6WQ
— Alia Bhatt (@aliaa08) March 15, 2022
కాగా ఈసినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇంకా ఫాక్స్ స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్లపై కరణ్ జోహార్, రణ్ బీర్ కపూర్, అయాన్ ముఖర్జీ, అపూర్వ మెహతా, నమిత్ మల్హోత్రా బ్రహ్మాస్త్ర చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈసినిమాకు ప్రీతమ్ సంగీతం అందిస్తున్నారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























