‘ఉన్నికృష్ణన్’ జయంతి.. ‘మేజర్’ సినిమా నుండి స్పెషల్ వీడియో..!

Adivi Seshs Major Team Releases A Special Video,Telugu Filmnagar,Latest Telugu Reviews,Latest Telugu Movies 2022,Telugu Movie Reviews,Telugu Reviews,Latest Tollywood Reviews, Major Updates,Major Movie Real life story of Major Sandeep Unnikrishnan,Major Sandeep Unnikrishnan martyred in 26/11 Mumbai shootings,Major Sandeep Unnikrishnan Birthday on 15th March, 45th birthday anniversary of Major Sandeep,The film Major released a special video on this special day, makers of Major released a special video on the birth anniversary of Major Sandeep Unnikrishnan, The video is named Reflections Of Major,Adivi Sesh Latest Movie,Adivi Sesh Latest Movie Update,Adivi Sesh Major,Adivi Sesh Major Movie,Adivi Sesh Major Movie Release Date,Sricharan Pakala Music Composer For Major Movie, Adivi Sesh Major Release Date,Adivi Sesh Major Update,Adivi Sesh movies,Adivi Sesh New Movie,Adivi Sesh Next Movie,Adivi Sesh announced that a major update is coming, Major Movie Releasing On May 27th,Major Movie Directed by Shashi Kiran Tikka,Director Shashi Kiran Tikka,Prakash Raj,Revathi,Saiee Manjrekar,Saiee Manjrekar Movies,Sashi Tikka,Sobhita Dhulipala, #AdiviSesh,#MajorSandeepUnnikrishnan,#MajorTheFilm,#MajorOnMAY27

కెరీర్ ప్రారంభం నుండి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ విజయాలను అందుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు అడివి శేష్. మేజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శశి కిరణ్ తిక్కా దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాను తెరెక్కిస్తున్న సంగతి తెలిసిందే. 26/11 దాడుల్లో ఆయన చూపించిన తెగువ, ధైర్య సాహసాలు మాత్రమే కాకుండా ఆయన జీవితంలోని ప్రతీ ఒక్క ఘటనను చూపించబోతోన్నారు. ఇక అడివి శేష్ కూడా ఈసినిమా కోసం ఎంత రీసెర్చ్ చేశారో కూడా ఇంతకుముందే చెప్పారు. అంతేకాదు ఈసినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పుడే ఈపాత్ర కోసం అడివి శేష్ తనను తాను ఏంతలా మార్చుకున్నారో అర్థమైంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక నేడు ఉన్నికృష్ణన్ జయంతి. ఉన్ని కృష్ణన్ 45వ జ‌యంతి సందర్భంగా ఆయన జీవితంలో ఉన్న మరపురాని కొన్ని జ్ఞాపకాలతో కూడిన వీడియోను మేజర్ చిత్రయూనిట్ రిలీజ్ చేసింది. ఇక ఈ వీడియోలో మేజర్ జీవితంలోని వివిధ దశలను చూపించారు. ఇందులో మేజర్‌కి తన తల్లితో ఉన్న ఆప్యాయత, సోదరితో అతని బంధం, స్నేహితులతో గ‌డిపిన క్షణాలు, శిక్షణా రోజులు, చివరకు నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్‌లో అధికారిగా అతని అనుభవాలను చూపించారు. వాటితో పాటు అడివి శేష్ కు సంబంధించిన విజువల్స్ కూడా చూపించారు. కొన్ని కొన్ని యాంగిల్స్ లో దాదాపు ఉన్ని కృష్ణన్ లానే అడివి శేష్ కనిపిస్తున్నాడు.

ఈ సినిమాలో శోభితా ధూళిపాళ్లతో పాటు స‌యీ మంజ్రేక‌ర్ కూడా మరో కథానాయికగా నటిస్తుంది. ప్రకాష్ రాజ్, రేవతి, మురళి శర్మ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మహేష్‌ హోమ్ బేనర్‌ జీఎంబీ ప్రొడక్షన్స్‌ సోనీ పిక్చర్స్‌తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల ఈ చిత్రానికి సంగీతం అందించారు. మే 27న ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, మలయాళంలో కూడా రిలీజ్ చేయనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine − seven =