ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం అంటే అంత తేలికైన విషయం ఏంకాదు. అది కూడా ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి రావడం.. అందులోనూ వరుస అవకాశాలను దక్కించుకోవడం అంటే అదృష్టం కలిసిరావాల్సిందే. ప్రస్తతం టాలీవుడ్ లో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న కిరణ్ అబ్బవరం విషయంలో మాత్రం తనకు లక్ బాగానే ఉందని చెప్పొచ్చు. కిరణ్ అబ్బవరం ‘రాజావారు రాణిగారు’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. అ సినిమా ఫలితం పక్కన పెడితే తన నటనకు గాను మంచి మార్కులు పడ్డాయి. రెండో సినిమా ‘ఎస్. ఆర్. కళ్యాణ మండపం’ గత యేడాది ఆగస్ట్ లో విడుదలై డీసెంట్ హిట్ అందుకుంది. అయినా కూడా అవకాశాల పరంగా మాత్రం కిరణ్ కు ఎలాంటి ఢోకా లేదు. పెద్ద పెద్ద బ్యానర్ లు సైతం కిరణ్ కు అవకాశం ఇస్తున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం వరుస సినిమాలు కిరణ్ లిస్ట్ లో ఉండగా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో అల్లు అరవింద్ సమర్పణలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమాకు వినరో భాగ్యము విష్ణు కథ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. ఇక తాజాగా ఈసినిమా షూటింగ్ ను స్టార్ట్ చేశారు. ఈ విషయాన్ని చిత్రబృందం తన ట్విట్టర్ ద్వారా తెలియచేసింది.
#VinaroBhagyamuVishnuKatha SHOOT BEGINS from today! 🤩#VBVKMovie first schedule begins in Tirupati! ✨#AlluAravind #BunnyVas @Kiran_Abbavaram @kashmira_9 @KishoreAbburu @chaitanmusic #MarthandaKVenkatesh @daniel_viswas @imsarathchandra @ItsChavan @GA2Official pic.twitter.com/pZqSOZujJw
— GA2 Pictures (@GA2Official) March 14, 2022
కాగా ఈ సినిమాకి కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తుండగా కశ్మీర హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: