జగన్ మరోసారి ఆలోచిస్తానన్నారు.. ఎవరూ మాట్లాడొద్దు..!

Chiranjeevi About His Meeting with YS Jagan,Latest Telugu Movie 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movies News, Tollywood Movies 2022,Chiranjeevi,Chirnjeevi Latest News,Chiranjeevi latest Updates,Chiranjeevi Meeting With Cm YS Jagan,Chiranjeevi News About the Meeting, Chiranjeevi Held Meeting With CM Jagan,Chiranjeevi On Movie Tickets,Chiranjeevi About Ticket Issue,Chrianjeevi and Ap CM YS Jagan Mohand Reddy,Ap Government, Chiranjeevi Latest Movie Updates,Chirajeevi Latest Movie News,Chiranjeevi Upcoming Movie,Chiranjeevi In Acharya,Chiranjeevi Acharya Movie Updates,Chiranjeevi Acharya 2022,

సినిమా టికెట్ల ధరల విషయంలో కొన్నినెలలుగా సినిమా ఇండస్ట్రీకి, ఏపీ ప్రభుత్వానికి మధ్య వివాదాలు తలెత్తున్న సంగతి తెలిసిందే కదా. ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలు తగ్గిస్తూ జీవో జారీ చేయడంతో సమస్యలు మొదలయ్యాయి. ఇక ఇప్పటికే దీనిపై చాాలా చర్చలు కూడా జరిగాయి. ఈనేపథ్యంలో నేడు ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో మెగాస్టార్ చిరంజీవి భేటీ అయిన సంగతి తెలిసిందే కదా. ఇక జగన్ తో చిరు భేటీ ముగిసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ.. జగన్ తో మీటింగ్ సంతృప్తికరంగా జరిగింది.సినీ పరిశ్రమ ల సమస్యల జగన్ గారికి వివరించాను. రెక్కాడితే కాని డొక్కాడని పేదలు ఇండస్ట్రీని నమ్ముకుని ఉన్నారు. ధియేటర్ల యజమానులకూ అనేక బాధలు ఉన్నాయి. హాళ్లని మూసేస్తేనే బెటర్ అనే భావనకు కొందరు ధియేటర్ యజమానులు ఉన్నారు. ఈ సమస్యలన్నీ సీఎంకు వివరించాను. ఆయన పరిష్కరించే దిశగా సానుకూలంగా స్పందించారు. జీఓ 35 గురుంచి పునారాలోచిస్తా అని హామీ ఇచ్చారు. సమస్య పరిష్కరించే వరకు దయచేసి ఎవరు మాట్లాడొద్దని.. జగన్ పిలిచి రెండు వైపుల సమస్యలు వినాలన్నారు.జగన్ పిలుపు నాకు బాధ్యతగా అనిపించింది. అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటానన్నారు. వారం పదిరోజుల్లో లేదా నెలలో కొత్త జీవో వస్తుంది. చిన్న సినిమాలపై కూడా ఆలోచించి ఐదో ఆటకు అనుమతి ఇస్తానన్నారు.

కాగా రీఎంట్రీ తరువాత చిరు వరుస సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఆచార్య సినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. దీనితో పాటు మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్, మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళాశంకర్ సినిమా అలానే బాబి దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు. ఈ మూడు సినిమాలు ప్రస్తుతం షూటింగ్ దశలోనే ఉన్నాయి. పార్లల్ గా మూడు సినిమాలను చేస్తున్నాడు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here