ఆర్య: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ , అను మెహతా , శివ బాలాజీ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన “ఆర్య ” మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ మూవీ తో సుకుమార్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆర్య మూవీ ని అద్భుతంగా తెరకెక్కించిన సుకుమార్ బెస్ట్ డైరెక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ , బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ గా నంది అవార్డ్ అందుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆర్య2 : ఆదిత్య ఆర్ట్స్ బ్యానర్ పై సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ , కాజల్ అగర్వాల్, నవదీప్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన “ఆర్య 2″మూవీ విజయం సాధించింది. హీరో అల్లు అర్జున్ న్యూ లుక్ , స్టైల్ తో ప్రేక్షకులను అలరించారు.”ఆర్య2” మూవీ ప్రపంచవ్యాప్తంగా 1000 స్క్రీన్స్ లో రిలీజ్ కావడం విశేషం.
100%లవ్ : అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై సుకుమార్ దర్శకత్వంలో నాగచైతన్య , తమన్నా జంటగా రూపొందిన రొమాంటిక్ కామెడీ “100%లవ్”మూవీ ఘనవిజయం సాధించింది. ఈ మూవీ లో తమన్నా మహాలక్ష్మి గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్ట్రెస్ గా పలు అవార్డ్స్ అందుకున్నారు. ఈ మూవీ ని సుకుమార్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించారు.
1:నేనొక్కడినే: 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సుకుమార్ దర్శకత్వంలో మహేష్ బాబు , కృతి సనన్ జంటగా తెరకెక్కిన సైకలాజికల్ థ్రిల్లర్ “1:నేనొక్కడినే” మూవీ 1500 స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ మూవీ లో మహేష్ బాబు తనయుడు గౌతమ్ అతిథి పాత్రలో నటించడం విశేషం. ఓవర్ సీస్ లో 1.327 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసింది.
నాన్నకు ప్రేమతో : శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై సుకుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్ , రకుల్ ప్రీత్ సింగ్ జంటగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ “నాన్నకు ప్రేమతో “మూవీ ఘనవిజయం సాధించింది. ఎన్టీఆర్ , రకుల్ జోడీ ప్రేక్షకులను అలరించింది. తండ్రి, కొడుకుల మధ్య అనుబంధాన్ని ఒక రివెంజ్ స్టొరీగా మార్చి తెరకెక్కించిన సుకుమార్ ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.
రంగస్థలం : మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ , సమంత జంటగా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రంగస్థలం ” మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో 200 కోట్ల క్లబ్ లో చేరింది. హీరో రామ్ చరణ్ వినికిడి లోపం ఉన్న చిట్టిబాబు , పల్లెటూరి యువతి రామలక్ష్మి గా అద్భుతం గా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు.
పుష్ప :ది రైజ్: మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక మందన్న జంటగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్“పుష్ప” మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న భారీ అంచనాలతో దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా సుమారు 300కోట్లు కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. “పుష్ప: ది రైజ్” మూవీ హిందీ వెర్షన్ బాలీవుడ్ లో 80 కోట్ల భారీ కలెక్షన్స్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది . రఫ్ అండ్ మాస్ అవతార్ లో అల్లు అర్జున్ అద్భుత పెర్ఫార్మెన్స్ కు టాలీవుడ్ సినీ ప్రముఖులతో పాటు బాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.
[totalpoll id=”73053″]




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: