కరోనా వల్ల ఎన్నో సినిమాలు వాయిదా పడి ఇటీవలే కాస్త రిలీజ్ కు నోచుకున్న సంగతి తెలిసిందే కదా. గత మూడు నెలల నుండి చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే పెద్ద సినిమాలు మాత్రం ఒకటి రెండు మించి అంతగా రిలీజ్ కాలేదు. నిజానికి సంక్రాంతికి చాలా సినిమాలు రిలీజ్ అవ్వాల్సి ఉంది. ఒక రెండు నెలల ముందు వరకూ కూడా చాలా సినిమాలు సంక్రాంతికి క్యూలో ఉన్నాయి. కానీ కొన్ని సినిమాలు షూటింగ్ అవ్వక తప్పుకుంటే.. కొన్ని సినిమాలు మాత్రం హెల్థీ కాంపిటీషన్ కోసం పోటీ నుండి తప్పుకున్నాడు. ప్రస్తుతానికి అయితే ఒకటి రెండు సినిమాలు మాత్రమే రిలీజ్ కు సిద్దంగా ఉన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం వస్తున్న వార్తలను బట్టి జనవరి 7న విడుదల కానున్న రాజమౌళి చిత్రం ఆర్ఆర్ఆర్ రిలీజ్ వాయిదా వేస్తున్నారని తెలుస్తుంది. ఇక ఇప్పుడు రాధేశ్యామ్ రిలీజ్ పై కూడా రూమర్స్ మొదలయ్యాయి. ఇప్పటికే పలుసార్లు రాధేశ్యామ్ టీమ్ రిలీజ్ పై క్లారిటీ ఇచ్చినా కూడా మళ్లీ రిలీజ్ డేట్ వాయిదా వేసే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు మరోసారి దీనిపై స్పందించి చిత్రనిర్మాణ సంస్థ తమ అధికారిక ట్విట్టర్ ద్వారా స్పష్టం చేశారు. తాజాగా ఈసినిమా నుండి ఒక పోస్టర్ ను రిలీజ్ చేసిన చిత్రయూనిట్.. మరోసారి రిలీజ్ డేట్ ను కూడా వేసి క్లారిటీ ఇచ్చింది. జనవరి 14నే సినిమా రిలీజ్ ఉంటుందని తెలిపారు.
కాగా రాాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్ గా వస్తున్న ప్రేమకథ రాధేశ్యామ్. ఇంకా ఈసినిమాలో కృష్ణంరాజు, సచిన్ ఖేడేకర్, ప్రియదర్శి, రిద్ధి కుమార్, సాషా చెత్రి, కునాల్ రాయ్ కపూర్, భాగ్యశ్రీ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాను గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తెలుగు, మలయాళం, హిందీ, తమిళ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఇక సౌత్ లో ఈ సినిమా పాటల కోసం జస్టిన్ ప్రభాకరన్ పనిచేస్తుండగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను థమన్ అందించనున్నాడు. ఇక హిందీ పాటలకి మిథున్, అమాల్ మాలిక్, మనన్ భరద్వాజ్ సంగీతం సమకూర్చారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: