గత రెండేళ్లుగా కరోనా వల్ల సినిమా పరిశ్రమ ఆర్థికంగా ఎంత దెబ్బతిందో చూశాం. అలాంటి పరిస్థితుల్లో కూడా ఎక్కువ సినిమాలు రిలీజ్ అయిన ఇండస్ట్రీ ఏదైనా ఉందంటే అది కేవలం ఒక్క టాలీవుడ్ ఇండస్ట్రీ అనే చెప్పొచ్చు. అంతేకాదు కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్నిసాధించడమే కాకుండా కలెక్షన్స్ పరంగా కూడా బాగానే సాలిడ్ కలెక్షన్స్ అందించింది. అంతేకాదు కరోనా సంగతి పక్కన పెడితే ఈ ఏడాది కొంత మంది హీరోలకు బాగానే కలిసొచ్చింది అని చెప్పొచ్చు. ఎప్పటినుండో ఫ్లాప్స్ తో సతమతమవుతున్న హీరోలకు మంచి కమ్ బ్యాక్ ఇయర్ కూడా అయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అందులో వకీల్ సాబ్, క్రాక్, సీటీమార్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్, నాంది సినిమాలు ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. పవర్ స్టార్ హీరోగా వచ్చిన వకీల్ సాబ్ ఈ ఏడాదే రిలీజ్ అయింది. ఒక రకంగా ఇది పవన్ కు రీఎంట్రీ సినిమా అనుకోవచ్చు. రాజకీయాల్లో బిజీ అయిన పవన్.. ఈసినిమాతో మళ్లీ ఎంట్రీ ఇచ్చారు. ఇక రీ ఎంట్రీ తోనే పవన్ తన సత్తా ఏంటో బాక్సాఫీస్ కు చూపించాడు. బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. రవి తేజ కు కూడా చాలా సినిమాల ఫ్లాప్స్ తరువాత క్రాక్ తో మంచి హిట్ దక్కింది. గోపిచంద్, నరేష్ లది కూడా అదే పరిస్థితి. చాలా కాలం నుండి వీరిద్దరి కి కూడా మంచి హిట్ పడలేదు. ఒక హిట్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో గోపీచంద్ కు సీటీమార్ తో, అల్లరి నరేష్ కు నాంది తో హిట్స్ వచ్చాయి. మరోవైపు యంగ్ హీరో అఖిల్ ది కూడా అదే పరిస్థితి.. మంచి బ్యాక్ గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినా కూడా అఖిల్ కు నాలుగో సినిమాతో కానీ హిట్ దక్కలేదు. మూడు సినిమాలు వరుసగా ఫ్లాప్స్ అయిన తరువాత ఈ ఏడాది రిలీజ్ అయిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ తో కెరీర్ లో మొదటి హిట్ ను సొంతం చేసుకున్నాడు. మరి వీరిలో ఎవరికి ఈ ఏడాది బెస్ట్ కమ్ బ్యాక్ ఇయర్ అయింది.. బెస్ట్ కమ్ బ్యాక్ హీరో ఎవరో మీ ఓటు ద్వారా తెలియచేయండి.
[totalpoll id=”72390″]




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: