గత రెండేళ్లుగా కరోనా వల్ల సినీ పరిశ్రమ ఎన్ని ఇబ్బందులు పడిందో చూశాం. ఇప్పటికీ పలువురు సెలబ్రిటీలు కరోనా బారిన పడుతూనే ఉన్నారు. ఇక గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది బాగానే సినిమాలు రిలీజ్ అయ్యారు. గత ఏడాది పెండింగ్ లో ఉన్న కొన్ని సినిమాలు.. ఈ ఏడాది పూర్తయిన సినిమాలు ఇలా బాక్సాఫీస్ వద్ద రిలీజ్ అయి సందడి చేశాయి. అయితే సక్సెస్ రేట్ ను పక్కన పెడితే కొన్ని సినిమాలు మాత్రం మంచి విజయాన్ని దక్కించుకున్నాయి. వాటిలో ముఖ్యంగా కొన్ని చిన్న సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద పెద్ద ఇంపాక్ట్ ను క్రియేట్ చేశాయి. అస్సలు అంచనాలు లేకుండా రిలీజ్ అయి కోట్లలో కలెక్షన్స్ ను రాబట్టాయి. అందులో చాలా సినిమాలో ఉండగా.. ముఖ్యంగా ఉప్పెన
జాంబిరెడ్డి, జాతి రత్నాలు, గాలి సంపత్, ఏక్ మినీ కథ, తిమ్మరుసు లాంటి సినిమాలు అటు ఘన విజయం సాధించడమే కాకుండా యంగ్ హీరోలకు వారి కెరీర్ కు మంచి బూస్టప్ ఇచ్చాయి. ఉప్పెన సినిమాతో వైష్ణవ్ తేజ్ గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడమే కాదు.. మొదటి సినిమాతోనే ఇండస్ట్రీలో తన మార్క్ ను చూపాడు. ఇక జాంబిరెడ్డితో తేజ సజ్జా కూడా హీరోగా అరంగేట్రం చేసి మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. జాతి రత్నాలు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఈ సినిమా కూడా సాలిడ్ కలెక్షన్స్ రాబట్టింది. తిమ్మరుసు కూడా సత్యదేవ్ కు హిట్ ఇచ్చి తన కెరీర్ ఎదుగుదలకు మంచి బూస్టప్ ఇచ్చింది. ఇక సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న సంతోష్ శోభన్ కు ఏక్ మినీ కథతో మంచి హిట్ దొరికింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మరి చిన్న బడ్జెట్ తో రిలీజ్ అయి మంచి హిట్ ఇచ్చిన సినిమాల్లో కొన్ని సినిమాలు కింద ఇవ్వబడ్డాయి. వాటిలో మీకు నచ్చిన సినిమా ఏదో మీ ఓటు ద్వారా తెలియచేయండి..
[totalpoll id=”72323″]
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: