సత్య దేవ్ ‘గాడ్సే’ టీజర్ రిలీజ్

Satdevs Godse Movie Teaser Out, Latest Telugu Movies 2021,Telugu Film News 2021, Latest Telugu Movie News, Telugu Filmnagar, Tollywood Movie Updates, Satdevs, Godse Movie Teaser, Godse Telugu Movie Teaser, Godse Teaser, Godse Movie Official Teaser, Satdevs Godse Movie, Satdevs New Movie Godse, Godse Movie, Godse Movie Updates, Godse Movie Latest News, Satdevs Upcoming Movies, Satdevs Latest News 2021, Godse Officail Teaser, godse movie release date, Godse Teaser, #GodseTeaser

యంగ్ హీరో సత్య దేవ్ కూడా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవలే తిమ్మరుసు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సత్యదేవ్ ప్రస్తుతం తన ఖాతాలో ఉన్న సినిమాలను రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. గోపీ గణేష్‌ దర్శకత్వంలో సత్యదేవ్ హీరోగా వస్తున్న సినిమా గాడ్సే. ఈసినిమా కూడా రిలీజ్ కు సిద్దమవుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఈసినిమా నుండి టీజర్ రిలీజ్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక టీజర్ కూడా సూపర్ గా ఆకట్టుకుంటుంది. ‘ఏ నినాదం వెనుక ఎవ‌రి ప్ర‌యోజ‌నాలు దాగున్నాయో తెలుసుకోనంత కాలం ప్ర‌జ‌లు మోస‌పోతూనే ఉంటారు’ అనే డైలాగుతో ‘గాడ్సే’ సినిమా టీజ‌ర్ విడుద‌ల‌యింది. సాధారణంగా ఉద్యోగం చేస్తే డబ్బులు వస్తాయి.. వ్యాపారం చేస్తే డబ్బులు వస్తాయి.. వ్యవసాయం చేస్తే డబ్బులు వస్తాయి కానీ, సేవ చేస్తున్నందుకు మీకు వందల వేల లక్షల కోట్లు ఎలా వస్తున్నాయిరా? ఎందుకంటే మీరంతా సేవ‌ల‌ పేరుతో ప్ర‌జ‌ల డ‌బ్బును కొల్ల‌గొడుతున్నారు అంటూ సత్యదేవ్ చెబుతోన్న డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది.

కాగా ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సాయికుమార్, సిజ్జు మీనన్, బ్రహ్మాజీ, ప్రకాష్ నాగ్, అశోక్ కుమార్, కోటేశ్వరరావు తదితరులు నటిస్తున్నారు. సికే స్క్రీన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్నాడు.

దీనితో పాటు మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘లవ్ మాక్ టైల్’ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు నాగ శేఖర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి లో ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × one =