ఎన్టీఆర్ యాక్టింగ్, చరణ్ హార్డ్ వర్క్ అంటే ఇష్టం..!

Salman Khan opens about Jr NTR and Ram Charan, Latest Telugu Movies 2021,Telugu Film News 2021, Latest Telugu Movie News, Telugu Filmnagar, Tollywood Movie Updates, Salman Khan, Jr NTR and Ram Charan Movie, Jr NTR, Ram Charan, Salman Khan opens about RRR Movie, Salman Khan chief guest of RRR launch in Mumbai, SS Rajamouli, Salman Khan Comments on RRR Movie, RRR Movie Updates, RRR Movie Latest News, Jr NTR Upcoming Movie, Jr NTR Movie Details, Ram Charan Movies, Salman Khan says Ram Charan most hardworking actor, Salman Khan poses with Ram Charan and Jr NTR

బాహుబలి తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న తదుపరి భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్ ఆర్ఆర్ఆర్. ఇండియన్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ సినిమా ఇది. ఇక పలు భాషల్లో ఈసినిమా రిలీజ్ అవుతుండగా.. అందులో తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళంలో డైరెక్ట్ గా రిలీజ్ అవుతుండగా.. మిగిలిన భాషల్లో డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈసినిమా జనవరి 7న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో రోజు రోజుకు ప్రమోషన్స్ లో స్పీడు పెంచుతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో ముంబై లో ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈకార్యక్రమానికి సల్మాన్ ఖాన్ అతిథిగా వచ్చారు. ఇక ఈ సందర్భంగా సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ.. నాకు ఎన్టీఆర్ యాక్టింగ్ అంటే చాలా ఇష్టం తను న్యాచురల్ పర్ఫామర్.. అలానే రామ్ చరణ్ హార్డ్ వర్క్ అంటే కూడా చాలా ఇష్టం.. నేను ఎప్పుడు రామ్ చరణ్ ను కలిసినా ఏదో ఒక దెబ్బతోనే కనిపిస్తాడు.. తను షూటింగ్ లో ఏదో ఒక గాయం చేసుకుంటూనే ఉంటాడు.. అంత హార్డ్ వర్క్ చేస్తాడు.. అని ఇద్దరిపై సల్మాన్ ప్రశంసలు కురిపించారు. ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయ్యాక కనీసం 4 నెలల వరకు ఏ సినిమానూ విడుదల చేయకపోవడమే మంచిది అంటూ స్వీట్ అడ్వైజ్ కూడా ఇచ్చాడు.

ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో స్వాతంత్య్ర సమరయోధులు కొమరం భీమ్‌, అల్లూరి సీతారామరాజు పాత్రల ఆధారంగా ఫిక్షన్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటిస్తుంది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి కూడా నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం పై దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − 10 =