క్యాన్సర్ తో పోరాడుతున్న ‘హంసా నందిని’

Actress Hamsa Nandini Battling Cancer, #HamsaNandini, Actress Hamsa Nandini, Actress Hamsa Nandini Breast Cancer, Actress Hamsa Nandini Detected With Third Stage Of Cancer, Actress Hamsa Nandini Diagnosed With BRCA1 Breast Cancer, Actress Hamsa Nandini Diagnosed With Breast Cancer, Actress Hamsa Nandini Diagnosed With Cancer, Actress Hamsa Nandini Diagnosed With Grade 3 Breast Cancer, Actress Hamsa Nandini Is Diagnosed With Breast Cancer, hamsa nandini, Hamsa Nandini About Her Breast Cancer, Hamsa Nandini Breast Cancer, Hamsa Nandini Cancer News, Hamsa Nandini Diagnosed with Breast Cancer, Hamsa Nandini Diagnosed With Cancer, Hamsa Nandini Diagnosed With Grade 3 Breast Cancer, Hamsa Nandini Health Condition, Hamsa Nandini Health News, Hamsa Nandini Health Report, Hamsa Nandini Health Update, Hamsa Nandini Latest Health Condition

సినీ సెలబ్రిటీస్ లో చాలా మంది క్యాన్సర్ బారిన పడిన వారిని చూసుంటాం. పాతతరం నుండి ఇప్పటి వరకూ చాలా మంది నటీనటులు క్యాన్సర్ ను అధిగమించి.. క్యాన్సర్ తో పోరాడి ఎంతోమందికి స్పూర్తిగా నిలిచిన వారు కూడా ఉన్నారు. ఇక ఇప్పుడు తాజాగా మరో నటి కూడా తను క్యాన్సర్ తో పోరాడుతున్నట్టు చెబుతుంది. ఆ నటి ఎవరో కాదు హంసానందిని. నేడు తన సోషల్ మీడియా ద్వారా ఈవిషయాన్ని బయటపెట్టింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘జీవితం నన్ను ఎలాంటి పరిస్థితుల్లోకి నెట్టినా… నేనొక బాధితురాలిగా ఉండదలుచుకోలేదు.. ప్రేమతో, ధైర్యంతో వాటిని ఎదుర్కొంటూ ముందుకు సాగుతాను.. నాలుగు నెలల క్రితం రొమ్ములో చిన్న కణతి ఉన్నట్లు అనిపించింది. ఇక జీవితం ఇప్పటిలా ఉండదనే విషయం అర్థమైంది. 18 ఏళ్ల క్రితమే నా తల్లిని కోల్పోయాను. అప్పటినుంచి భయంలోనే బతుకుతున్నాను. ‘రొమ్ములో కణతిని గుర్తించిన కొద్ది గంటల్లోనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకున్నాను. పరీక్షల్లో నాకు గ్రేడ్ 3 రొమ్ము క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. త్వరగా సర్జరీ చేయించుకోవడంతో శరీరంలోని ఇతర భాగాలకు క్యాన్సర్ వ్యాపించలేదు. అయితే ఆ రిలీఫ్ ఎంతోసేపు నిలవలేదు. ఆ తర్వాత చేసిన వైద్య పరీక్షల్లో నాకు జన్యుపరమైన క్యాన్సర్ ఉన్నట్లు బయటపడింది. రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం 70 శాతం, గర్భాశయ క్యాన్సర్ వచ్చే అవకాశం 40 శాతం ఉన్నట్లు తేలింది. ఇందుకోసం నేను పలు సర్జరీలు చేయించుకోవాల్సి ఉంది. ఇప్పటికే కీమోథెరపీ 9 దశలు పూర్తయ్యాయి. మరో 7 సార్లు కీమోథెరపీ చేయించుకోవాల్సి ఉంది. నా జీవితాన్ని క్యాన్సర్ ప్రభావితం చేయకూడదని నేను భావిస్తున్నాను. చిరునవ్వుతోనే క్యాన్సర్‌పై పోరాడుతాను.. మరింత ధృఢంగా మారి మళ్లీ స్క్రీన్‌పై కనిపిస్తాను అని హంసానందిని చెప్పుకొచ్చారు. మరి హంసానందిని త్వరగా కోలుకోవాలని.. ఇంతకుముందు లాగే మరెన్నో సినిమాలు చేయాలని కోరుకుందాం..

 

View this post on Instagram

 

A post shared by Hamsa Nandini (@ihamsanandini)

కాగా వంశీ దర్శకత్వంలో వచ్చిన ‘అనుమానస్పదం’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఎక్కువగా పరిచయమైంది హంసా నందిని. ఆ తర్వాత చాలా సినిమాలు చేసింది కానీ హీరోయిన్ గా మాత్రం నిలదొక్కుకోలేకపోయింది. అంతేకాదు పలు స్పెషల్ సాంగ్స్ లో కూడా నటించింది ఈ భామ.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − seven =