పలు తెలుగు , తమిళ సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తున్న రాశీఖన్నా ప్రస్తుతం నాగచైతన్య “థ్యాంక్యూ”, గోపీచంద్ “పక్కా కమర్షియల్ “మూవీస్ తో పాటు 5 తమిళ , ఒక మలయాళ మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.దాదాపు 8 సంవత్సరాలు తరువాతధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై పుష్కర్ ఓజా, సాగర్ ఆంబ్రే దర్శకత్వం లో సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగాతెరకెక్కనున్న బాలీవుడ్ మూవీ కి రాశీఖన్నా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తమిళభాషలో హారర్ థ్రిల్లర్ సినిమాలను తెరకెక్కించడంలో దర్శకుడు సుందర్.సి అగ్రగణ్యుడు. “అరణ్మనై”టైటిల్ తో సుందర్ వరుస సినిమాలు తెరకెక్కిస్తున్నారు. “అరణ్మనై”, “అరణ్మనై 2” మూవీస్ భారీ విజయాలను అందుకున్నాయి. తెలుగు డబ్బింగ్ వెర్షన్స్ “చంద్రకళ”, “కళావతి” మూవీస్ తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.ఉదయనిధి స్టాలిన్ నిర్మాతగా సుందర్ సి దర్శకత్వంలో ఆర్య , రాశీఖన్నా జంటగా తెరకెక్కిన ” అరణ్మనై 3″ తమిళ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ టైటిల్ “అంతఃపురం” గా , డిసెంబర్ 31 వ తేదీ రిలీజ్ డేట్ గా మేకర్స్ ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈమూవీ లో సుందర్ తో పాటు ఖుష్బూ , ఆండ్రియా , సాక్షి అగర్వాల్ , యోగిబాబు, సంపత్ రాజ్ ముఖ్య పాత్రలలో నటించారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: