‘బాహుబలి’ ఆ హద్దుల్ని చెరిపేసింది..!

Baahubali Movie Has Removed Language Barriers Says Jr NTR,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Tollywood Latest News,Jr NTR About RRR Movie,Jr NTR Sensational Comments On RRR Telugu Movie,Jr NTR Says RRR Movie Removed Language Barriers,Jr NTR Latest Press Meet,RRR Movie Press Meet,RRR,RRR Movie,RRR Telugu Movie,RRR Movie Updates,RRR Telugu Movie Latest News

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌ల‌తో రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఫిక్ష‌న‌ల్ పీరియాడిక్ మూవీ ఆర్ఆర్ఆర్. ఈసినిమా కోసం ఎన్టీఆర్ అభిమానులు రామ్ చరణ్ అభిమానులతో ప్రతి సినీ లవర్ కూడా ఈసినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక పాన్ ఇండియా రేంజ్ లో ఈసినిమా తెరకెక్కుతుంది కాబట్టి కేవలం తెలుగులో మాత్రమే కాకుండా హిందీ, కన్నడ, తమిళ్ లో కూడా పలు ప్రెస్ మీట్ లో కూడా పాల్గొంటున్నారు. ఇక తాజాగా తమిళ ప్రెస్ మీట్ లో కూడా పాల్గొన్నారు. ఈసందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమాకు థ్యాంక్స్ చెప్పాలి.. రీజనల్ సినిమాకు ఉన్న బారియర్స్ ను ఈసినిమా చెరిపేసింది.. విజయ్ సర్ చేసిన మాస్టర్ సినిమా తెలుగులో మంచి హిట్ అయింది.. అలానే ధనుష్ సర్ సినిమాలకు కూడా మంచి ఆదరణ ఉంది.. దీన్నిబట్టి ఆడియన్స్ టాలెంట్ ను ప్రోత్సాహిస్తారు అన్న విషయం అర్థమవుతుంది అని తెలిపాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా  సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటిస్తుంది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి కూడా నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

మరి ఈసినిమా నుండి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. ట్రైలర్ అయితే సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అన్న ఆసక్తిని పెంచేసింది. మరి ఈసినిమా ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven + 14 =