లెజెండరీ డైరెక్టర్ శంకర్ సినిమా అంటేనే ఏ రేంజ్‌లో ఉంటుందనేది ప్రతి ఒక్కరికీ తెలిసిందే. ఏ హీరో అయినా శంకర్ లాంటి డైరెక్టర్ తో ఒక్క సినిమా చేయడం అనేది పెద్ద డ్రీమ్ లాగానే ఫీలవుతుంటారు. ఇప్పుడు తన డ్రీమ్ కూడా నెరవేరింది అంటున్నాడు రామ్ చరణ్. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్‌లో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. మెగా హీరోతో శంకర్ సినిమా అంటే ఏ రేంజ్ లో క్రేజ్ ఉంటుందో చెప్పనవసరం లేదు. రామ్ చరణ్ 15వ సినిమాగా ఈసినిమా వస్తుండటంతో ప్రస్తుతానికి 15 అనే వర్కింగ్ టైటిల్ తోనే షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఈసినిమా భారీ విజువల్ వండర్‌గా చెర్రీ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ మూవీ కావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈసినిమా ఫస్ట్ షెడ్యూల్ ను పూణేలో మొదలుపెట్టగా అక్కడ కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నారు మేకర్స్. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చరణ్ ఈ సినిమా రిలీజ్ పై కాస్త క్లారిటీ ఇచ్చాడు. శంకర్ తో సినిమా చేయాలన్న తన డ్రీమ్ నెరవేరుతుందని.. ప్రస్తుతానికి షూటింగ్ అయితే జరుగుతుంది.. 2023 ఫిబ్రవరిలో ఈసినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు రామ్ చరణ్ తెలిపాడు. మరి శంకర్ సినిమా అంటే గ్రాఫిక్స్, విజువల్స్ భారీగా ఉంటాయి కాబట్టి ఆ మాత్రం టైమ్ పడుతుంది.
ఇక ఈ చిత్రంలో జయరామ్, అంజలి, సునీల్, నవీన్ చంద్ర కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా రూపొందిస్తున్నాడు. దానికితోడు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ 50వ సినిమా కావడంతో ఎంతో ప్రత్యేకంగా ఈసినిమాను ప్లాన్ చేస్తున్నాడు దిల్ రాజు.పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈసినిమాను తమిళ్, తెలుగు, హిందీలో చిత్రీకరిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: